ఢిల్లీలో వెరీ పూర్ కేటగిరిలో ఎయిర్ క్వాలిటీ

ఢిల్లీలో వెరీ పూర్ కేటగిరిలో ఎయిర్ క్వాలిటీ

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్ కేటగిరిలో కంటిన్యూ అవుతోంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 320గా రికార్డ్ అయింది. బయటకు రావాలంటే భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ వాసులు. పిల్లల్ని బయటకు పంపాలంటే ఆందోళనగా ఉందంటున్నారు. రోజు రోజుకు పొల్యూషన్ పెరుగుతుందంటున్నారు.

ఇప్పటికే పిల్లలు జలుబు దగ్గుతో బాధపడుతున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా పొల్యూషన్ తగ్గించేందుకు పరిష్కారాలు ఆలోచించాలంటున్నారు స్థానికులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలంటున్నారు.