ఒడెస్సా పోర్ట్ సిటీపై రష్యా దాడులు

ఒడెస్సా పోర్ట్ సిటీపై రష్యా దాడులు

ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. బ్లాక్ సీలోని ఉక్రెయిన్ పోర్ట్ సిటీ ఒడెస్సాపై రష్యా మిసైల్ దాడులు జరుపుతోంది. ఈ విషయాన్ని ఆ దేశ ఇంటీరియర్ మినిస్టర్ ప్రకటించారు. రష్యా క్షిపణి దాడులతో చాలా ప్రాంతాల్లో అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు 10 లక్ష ల జనాభా కలిగిన ఈ పోర్ట్ సిటీ ప్రస్తుతం ఉక్రెయిన్ ఆధీనంలోనే ఉంది. సముద్ర మార్గం నుంచి యాంఫీబీయస్ దాడులు చేసేందుకు రష్యా ఏర్పాట్లు చేసుకుంటోందని, అయితే వాటిని ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ సైన్యం సిద్ధంగా ఉంటే భారీ నష్టం తప్పదని బ్రిటన్ రక్షణ శాఖ చెబుతోంది. 

ఒకవైపు జెలెన్ స్కీ పుతిన్ మధ్య త్వరలో చర్చలు జరుగుతాయని వార్తలు వస్తుండగా..  పరిస్థితులు అందుకు అనుకూల పరిస్థితులు నెలకొనలేదని రష్యా ప్రతినిధులు చెబుతున్నారు. క్రిమియా, డాన్ బాస్ విషయంలో రష్యా విధానంలో ఎలాంటి మార్పు రాలేదని స్పష్టం చేశారు. మరోవైపు ఎలాంటి దాడులనైనా తిప్పి కొట్టేందుకు ఒడెస్సాలో ఉక్రెయిన్ సైన్యం ట్యాంక్ ట్రాప్ లతో నింపేశారు. ప్రధాన కట్టడాలు ధ్వంసం కాకుండా ఇసుక మూటలతో కప్పేశారు.

మరిన్ని వార్తల కోసం..

పబ్‎లో ప్రముఖులు.. లైవ్ అప్‎డేట్స్

డ్రగ్స్‌ వ్యవహారం.. బంజారాహిల్స్ సీఐ సస్పెన్షన్