విమాన చార్జీలు వాపస్ ఇవ్వాల్సిందే…

విమాన చార్జీలు వాపస్ ఇవ్వాల్సిందే…

లాక్ డౌన్ నేపథ్యంలో రద్దయిన విమానాల చార్జీలను ప్రయాణికులకు తిరిగి ఇవ్వాలని ఆయా విమాన సంస్థలకు కేంద్రం ఆదేశించింది. దీంతో పాటు క్యాన్సిలేషన్ చార్జీలు వసూలు చేయకూడదని తెలిపింది.  ఈ ఆదేశాలు అమలయ్యేలా పర్యవేక్షించాలని డిప్యూటీ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ను ఆదేశించింది. దీంతో .. మార్చ్ 25నుంచి మే3 మధ్య ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నవాళ్లకు మూడువారాల్లో రిఫండ్ చేయాలని ఆదేశించింది DGCA.

కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో కేంద్రం లాక్ డౌన్ విధించడం వలన… విమానాలు రద్దయ్యాయి. దీంతో అప్పటికే టికెట్ బుక్ చేసుకున్నవారి చార్జీలు లాస్ అవుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.   అయితే మే 4 న లాక్ డౌన్ నుంచి ఉపశమనం దొరుకుందని బావిస్తున్నామని ఇండిగో విమాన సంస్థ మంగళవారం అభిప్రాయపడింది. దీంతో పాటు మే 4నుంచి విమానాలను నడుపుతామని తెలిపింది.