కత్తులు, కత్తెర్లు, బ్లేడ్లు, బుల్లెట్లతో క్రిస్మస్ చెట్టు

కత్తులు, కత్తెర్లు, బ్లేడ్లు, బుల్లెట్లతో క్రిస్మస్ చెట్టు

క్రిస్మస్​కు ఇంకో వారం రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని చోట్లా కేక్​ మిక్సింగ్​లు చేసేస్తున్నరు. ఇళ్లలో క్రిస్మస్​ చెట్లు నాటేస్తున్నరు. శాంటా నాకేం గిఫ్ట్​ ఇస్తవ్​ అని పిల్లలు అడిగేస్తున్నరు. అయితే, కొన్ని చోట్ల కొంచెం వెరైటీగా కానిచ్చేస్తున్నరు కొందరు. ఓ ఎయిర్​పోర్టోళ్లు కత్తెర్లు, బుల్లెట్లతో సరికొత్త క్రిస్మస్​ ట్రీని పెడితే, ఒకామె నల్లోళ్ల కోసం సెపరేట్​గా బ్లాక్​ శాంటా యాప్​ను స్టార్ట్​ చేసింది. ఎక్కడికైనా వెళితే చాలా మంది అవసరమున్నవి లేనివి అన్నింటిని బ్యాగులో కుక్కేసి లగేజీలో తీసుకెళుతుంటరు. అయితే, ఎయిర్​పోర్టులో స్కానింగ్​లు ఎక్కువ కదా. అనుమతి లేని వస్తువులేవైనా కనిపిస్తే వెంటనే అధికారులు లాగేసుకుంటరు. ఇదిగో, అలా గుంజుకున్న కత్తెర్లు, బుల్లెట్లు, బ్లేడ్లు, కత్తులతో కొత్త క్రిస్మస్​ ట్రీని లిథువేనియాలోని విల్నియస్​ ఎయిర్​పోర్ట్​ ఏర్పాటు చేసింది. అంతేకాదు, లైటర్లు, పండ్లు,  కూరగాయల తొక్క తీసే పీలర్లనూ అందులో పెట్టింది. తమ క్రిస్మస్​  చెట్టు మాస్టర్​పీస్​ అంటున్నరు ఆ ఎయిర్​పోర్టు అధికారులు.

ఇప్పటిదాకా కొత్తగా, సహజంగా, అందంగా పెట్టుకున్న క్రిస్మస్​ ట్రీలను చూసి ఉంటారు గానీ, తాము పెట్టినటువంటి చెట్టును మాత్రం చూసి ఉండరని గ్యారంటీ ఇస్తం అంటున్నరు. ఎయిర్​పోర్టు అధికారుల క్రియేటివిటీ చూసి నెట్టింట జనం మస్తు ఖుషీ అయితున్నరు. ఇది ఇట్లుంటే అమెరికాలోని టెక్సస్​కు చెందిన ఒకామె బ్లాక్​ శాంటా కోసం ఓ యాప్​నే తయారు చేసింది. తన పిల్లల కోసం బ్లాక్​ శాంటాను ఏళ్లకొద్దీ వెతికి వెతికి విసిగిపోయిన జిహాన్​ వుడ్స్​ అనే ఆమె, ‘ఫైండ్​ బ్లాక్​ శాంటా’ పేరుతో యాప్​ను తయారు చేసింది. గత ఏడాది అక్టోబర్​లో ఆ యాప్​ తయారీకి అయ్యే ఖర్చు కోసం దాతలను వెతికింది. నెల రోజుల్లోనే 5 వేల డాలర్లను (సుమారు రూ.3.5 లక్షలు) సమీకరించింది. శాంటాలు జనాలకు తగ్గ రంగుంటే పిల్లల్లో పాజిటివ్​నెస్​ పెరుగుతుందని, అందుకే ఇట్ల చేసిన అని సైకియాట్రిస్ట్​ అయిన ఆమె చెబుతోంది.