
న్యూఢిల్లీ: ఎయిర్ ట్రాఫిక్‌ను కంట్రోల్చేయాల్సిన సిబ్బంది నైట్‌డ్యూటీలో నిద్రపోవడంతో ఓ విమానం దాదాపు గంటసేపు గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. మంగళవారం రాత్రి పారిస్ నుంచి బయల్దేరిన ఓ ఫ్లైట్ఇటలీలోని అజాసియో ఎయిర్‌పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ఫ్లైట్దిగే సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ లైన్‌క్లియర్ మెసేజ్ఇవ్వాల్సి ఉంది. కానీ ఎయిర్ పోర్టు టవర్ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో పైలట్విమానాన్ని కిందకు దించలేకపోయాడు.
రన్‌వేపై ల్యాండింగ్‌కు అనుమతి రాకపోవడంతో పైలట్ విమానాన్ని గాల్లోనే గంటపాటు ఉంచాల్సి వచ్చింది. అదే సమయంలో ఎయిర్‌పోర్టు ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది అప్రమత్తమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్‌కు వెళ్లి చూడగా అక్కడి సిబ్బంది నిద్రపోతూ కన్పించారు. వెంటనే వాళ్లను నిద్రలేపి రన్‌వేపై లైట్లను ఆన్‌చేసి ఫ్లైట్ల్యాండింగ్కు అనుమతి ఇచ్చారు. దీంతో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.