
న్యూఢిల్లీ: తన ఆఫ్రికా కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్సేవలను అందించడానికి ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ సంస్థ స్టార్‌లింక్ పేరుతో ఉపగ్రహ ఆధారిత హై-స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ భాగస్వామ్యం ద్వారా, ఎయిర్‌టెల్ ఆఫ్రికాలోని తమ కార్యకలాపాలు ఉన్న 14 దేశాలలో (ప్రస్తుతానికి 9 దేశాల్లో స్పేస్‌ఎక్స్‌కు లైసెన్స్ ఉంది.
మిగిలిన 5 దేశాల్లో లైసెన్స్ రావాల్సి ఉంది) వినియోగదారులకు వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు, వ్యాపారాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలకు ఈ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఎయిర్‌టెల్ తెలిపింది.