
న్యూఢిల్లీ: రీఛార్జ్ రేట్లను మరోసారి పెంచుతామనే సంకేతాలను ఎయిర్‌టెల్ ఇచ్చింది. వచ్చే మూడు నాలుగు నెలల్లో లేకపోయినా, ఈ ఏడాదిలోపు టారిఫ్ రేట్లు పెంపు ఉంటుందని ఎయిర్‌టెల్ సీఈఓ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు. ఈ ఏడాదిలో యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ (ఆర్పూ) రూ. 200 పెంచుకోవాలని కంపెనీ టార్గెట్‌గా పెట్టుకుంది. ఎయిర్‌టెల్ టారిఫ్ రేట్లను పెంచితే మిగిలిన కంపెనీలు కూడా అదే బాట పడతాయి. కాగా, కిందటేడాది డిసెంబర్ క్వార్టర్‌లో ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియాలు 20–25 శాతం మేర టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. ఈ రేట్ల పెంపుతో ఈ కంపెనీల ఆర్పూ రూ. 20–25 పెరిగిందని అంచనా. కాగా, ఎయిర్‌టెల్ నికర లాభం డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో రూ. 830 కోట్లుగా నమోదయ్యింది. ఈ రిజల్ట్స్ బాగుండడానికి కారణం టారిఫ్ రేట్లు పెంచడం, గూగుల్ ఇన్వెస్ట్‌మెంట్ అని ఎయిర్‌టెల్ ప్రకటించింది.