ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్.. అన్ లిమిటెడ్ 5జీ డేటా & కాల్స్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్

ఎయిర్‌టెల్ కొత్త ప్లాన్స్.. అన్ లిమిటెడ్ 5జీ డేటా & కాల్స్, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్

ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు 5G సేవలకు ఉచితంగా యాక్సెస్‌ను అందించడమే కాకుండా ఎంచుకున్న ప్రీపెయిడ్,  పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో అపరిమిత 5G డేటా వినియోగాన్ని అందించనున్నట్టు ప్రకటించింది. దీని వల్ల 5G యాక్సెస్ ఉన్న ప్రాంతాల్లో ఉన్న ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్‌లు బ్రౌజింగ్, స్ట్రీమింగ్, వీడియోస్ చూడడం  వంటి కార్యకలాపాల కోసం హై-స్పీడ్ ఇంటర్నెట్‌ తో ఆస్వాదించే అవకాశం ఏర్పడుతుంది. దాంతో పాటు ఎయిర్ టెల్ నిర్దిష్ట ప్రీపెయిడ్ ప్లాన్‌లపై అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) , డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney+)లను ఉచితంగా యాక్సెస్‌ చేసుకోవచ్చంటూ తీపికబురును అందించింది. అంటే వినియోగదారులు తమకు ఇష్టమైన OTT కంటెంట్‌ను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా చూసేందుకు వీలు కల్పిస్తుంది.

మీరు ఎయిర్‌టెల్ 5G వినియోగదారు అయి ఉండి అపరిమిత కాలింగ్, OTT ప్రయోజనాలను పొందాలనుకుంటే, Amazon Prime లేదా Disney+ Hotstarకి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే క్రింది ప్లాన్‌ల జాబితాను ఒక్కసారి గమనించండి.

₹ 499 ప్లాన్

ఈ ప్లాన్ ప్రకారం అపరమిత కాలింగ్, 100 రోజువారీ SMSలతో పాటు అన్ లిమిటెడ్ 5G ఇంటర్నెట్ డేటాను అందిస్తోంది. అదనంగా Xtream యాప్ ప్రయోజనాలు, వింక్ సబ్‌స్క్రిప్షన్, మరిన్ని వంటి ఇతర ప్రయోజనాలతో పాటు Disney+ Hotstarతో పాటు 3-నెలల సభ్యత్వానికి అర్హులు. ఇంకా 5G సేవలను అందుకోని వినియోగదారుల కోసం, రోజువారీ 3GB క్యాప్ తో అపరిమిత 4G డేటాను అందిస్తోంది. ఈ ప్లా్న్ గడువు 28 రోజులు.

₹ 839 ప్లాన్

ఎయిర్ టెల్ అందించే ఈ 84-రోజుల ప్లాన్  ప్రకారం అపరిమిత 5G ఇంటర్నెట్ డేటా, అపరిమిత కాలింగ్,100 రోజువారీ SMSలను అందిస్తుంది. సబ్‌స్క్రయిబర్‌లకు Xstream యాప్, RewardsMini సబ్‌స్క్రిప్షన్, Wynk సబ్‌స్క్రిప్షన్  వంటి ఇతర ప్రయోజనాలతో పాటు Disney+ Hotstar 3-నెలల సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఆస్వాదించవచ్చు. మీ ప్రాంతంలో 5G సేవలు అందుబాటులో లేనట్లయితే ఇదే ప్లాన్ లో రోజువారీ 2GB పరిమితితో అపరిమిత 4G డేటాను అందిస్తుంది.

₹ 699 ప్లాన్

ఎయిర్ టెల్ 56 రోజుల ప్లాన్ ప్రకారం, వినియోగదారులకు అపరిమిత 5G డేటా, కాలింగ్, 100 రోజువారీ SMSలను అందిస్తుంది. అదనంగా సబ్‌స్క్రైబర్‌లు 56 రోజుల Amazon Prime మెంబర్‌షిప్‌తో పాటు Xstream యాప్ ప్రయోజనాలు, Wynk సబ్‌స్క్రిప్షన్‌లు, మరికొన్నింటిని అదనంగా ఆస్వాదించవచ్చు. 5G సేవలకు యాక్సెస్ లేని వారికి రోజువారీ 3GB క్యాప్‌తో అపరిమిత 4G డేటాను అందిస్తుంది.