సెప్టెంబర్‌‌ క్వార్టర్‌‌లో జియోని అధిగమించిన ఎయిర్ టెల్

సెప్టెంబర్‌‌ క్వార్టర్‌‌లో జియోని అధిగమించిన ఎయిర్ టెల్

న్యూఢిల్లీ: జియోతో పోలిస్తే ఎయిర్‌‌‌‌‌‌టెల్ రెవెన్యూ గ్రోత్‌‌  సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌ (క్యూ2) లో ఎక్కువగా ఉంది. ఈ టెలికం  కంపెనీ అర్బన్ మార్కెట్‌‌లో వేగంగా విస్తరించడంతో పాటు, ఉన్న ఆస్తులను చక్కగా వాడుకుంటూ తన రెవెన్యూ మార్కెట్ షేర్‌‌‌‌ (ఆర్‌‌‌‌ఎంఎస్‌‌– ఒక విధంగా సేల్స్‌‌) ను పెంచుకుంటోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా  కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌‌ సర్కిల్స్‌‌లో తమ ప్రాబల్యాన్ని కోల్పోతోంది. ఫలితంగా కంపెనీ  రెవెన్యూ మార్కెట్‌‌ షేర్ సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో తగ్గింది. ‘మెట్రోలు, ‘ఏ’ సర్కిల్స్‌‌లలో జియోతో పోలిస్తే  భారతి ఎయిర్‌‌‌‌టెల్‌‌ వేగంగా విస్తరిస్తోంది. కంపెనీ పోస్ట్‌‌పెయిడ్ కస్టమర్లు పెరుగుతున్నారు. యూజర్ల డేటా వాడకాన్ని చక్కగా మోనిటైజ్‌‌ (డబ్బులుగా) చేసుకుంటోంది’ అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఓ నోట్‌‌లో పేర్కొంది. సబ్‌‌స్క్రయిబర్లు పెరిగినప్పటికీ జియో రెవెన్యూ గ్రోత్  ఎయిర్‌‌‌‌టెల్ కంటే తక్కువగా రికార్డయ్యింది. ఎనిమిది సర్కిల్స్‌‌లలో ఆర్‌‌‌‌ఎంఎస్‌‌ లీడర్‌‌‌‌షిప్ పొజిషన్‌‌ను ఈ కంపెనీ కోల్పోయిందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇంకా ఢిల్లీ, తమిళనాడు, రాజస్తాన్ సర్కిల్స్‌‌లలో జియో పెర్ఫార్మెన్స్ పెద్దగా మెరుగుపడలేదని అన్నారు. 5జీ అమలు చేస్తుండడంతో ఎయిర్‌‌‌‌టెల్, జియో రెవెన్యూ పెరుగుతుందని అంచనావేశారు. కానీ, వీ రెవెన్యూ తగ్గొచ్చని చెప్పారు. ట్రాయ్ డేటా ప్రకారం,  ఎయిర్‌‌‌‌టెల్‌‌ అడ్జెస్టెడ్‌‌ గ్రాస్ రెవెన్యూ  క్యూ2లో 0.83% పెరిగింది. మార్కెట్‌‌లో ఈ కంపెనీ వాటా 36.3 శాతానికి చేరుకుంది.  ఇదే టైమ్‌‌లో జియో  ఏజీఆర్‌‌‌‌ 0.56%  పెరిగింది. ఆర్‌‌‌‌ఎంఎస్‌లో కంపెనీ వాటా 41.4 శాతంగా ఉంది. వీ ఏజీఆర్ మాత్రం 0.2 % తగ్గింది. కంపెనీ వాటా 17.5 శాతానికి పడిపోయింది. 

రూ.2.87 లక్షల కోట్లకు టెలికం రెవెన్యూ

2023–25 మధ్య దేశ టెలికం సెక్టార్ రెవెన్యూ 13 శాతం పెరిగి 35 బిలియన్ డాలర్ల (రూ.2.87 లక్షల​ కోట్ల) కు చేరుకుంటుందని జెఫరీస్‌‌ అంచనావేసింది. 5జీలో ఇన్వెస్ట్ చేస్తున్న జియో, ఎయిర్‌‌‌‌టెల్‌‌ల మార్కెట్ షేర్  పెరుగుతుందని పేర్కొంది. ‘రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లోని మార్చి క్వార్టర్‌‌‌‌లో టారిఫ్‌‌లు 10 %  చొప్పున పెరుగుతాయి. దీంతో టెలికం సెక్టార్ రెవెన్యూ ఏడాదికి 13 %  చొప్పున పెరుగుతుంది.  2023–25 మధ్య జియో, ఎయిర్‌‌‌‌టెల్ మార్కెట్ షేర్ 1.2 నుంచి 1.4% పెరగొచ్చు’ అని జెఫరీస్ ఓ నోట్‌‌లో పేర్కొంది.  కాగా, సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో ఎయిర్‌‌‌‌టెల్‌‌ ఏజీఆర్ క్వార్టర్ ప్రాతిపదికన 4 %  పెరిగి రూ.19,700 కోట్లకు, జియో ఏజీఆర్ 3% పెరిగి రూ.22,500 కోట్లకు, వీ ఏజీఆర్‌‌‌‌ 0.5 % పెరిగి రూ.9,500 కోట్లకు చేరుకున్నాయి.