పోటీపడి మరీ రేట్లు తగ్గిస్తున్న ఎయిర్‌టెల్-జియో బ్రాడ్ బ్యాండ్స్

పోటీపడి మరీ రేట్లు తగ్గిస్తున్న ఎయిర్‌టెల్-జియో బ్రాడ్ బ్యాండ్స్

ఎయిర్‌‌టెల్‌–జియో ఫైబర్‌‌ వార్‌

ఫలితంగా బ్రాడ్ బాండ్‌ రేట్లు తగ్గుతున్నాయ్‌

బిజినెస్ డెస్క్‌‌, వెలుగు: మొబైల్‌‌ టారిఫ్‌‌ల విషయంలో  పోటీ పడుతున్న  టెలికాం కంపెనీలు రిలయన్స్‌‌ జియో, భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌.. ఇప్పుడు ఫిక్స్‌‌డ్‌‌ బ్రాడ్‌‌బ్యాండ్‌‌ సెగ్మెంట్‌‌లో కూడా టారిఫ్‌‌ వార్‌‌‌‌కు దిగుతున్నాయి. ముకేష్‌‌ అంబానీ  జియో ఫైబర్‌‌‌‌  గత వారం రూ. 399 (+ట్యాక్స్‌‌లు)కే నెల పాటు సెకెన్‌‌కు 30 ఎంబీ స్పీడ్‌‌ అన్‌‌లిమిటెడ్‌‌ ప్లాన్‌‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌‌ మొదట్లో రూ. 699 కి అందుబాటులో ఉండేది. జియో ధరలను తగ్గించడంతో భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌ కూడా బ్రాడ్‌‌ బ్యాండ్‌‌ సెగ్మెంట్‌‌లో తమ ప్లాన్ల రేట్లను తగ్గించడం ప్రారంభించింది. ఆదివారం ఈ కంపెనీ రూ. 499 (+ట్యాక్స్‌‌లు) కే నెల పాటు సెకెన్‌‌కు 40 ఎంబీ  స్పీడ్‌‌తో అన్‌‌లిమిటెడ్‌‌ డేటా ప్లాన్‌‌ను ప్రకటించిది. ఇంతకు ముందు ఈ  ప్లాన్‌‌ ధర రూ. 799 గా ఉంది. ప్రభుత్వ రంగ కంపెనీలు మహానగర్‌‌‌‌ టెలిఫోన్ నిగమ్‌‌ లిమిటెడ్‌‌, భారత్‌‌ సంచార్‌‌‌‌ నిగమ్‌‌ లిమిటెడ్‌‌లు ఆఫర్‌‌‌‌ చేస్తున్న టారిఫ్‌‌ల  మాదిరే ఈ కంపెనీలు కూడా బేస్‌‌ ప్లాన్లను తీసుకొస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ప్రభుత్వ కంపెనీలు నెలకు ఇచ్చే ఆఫర్లు రూ. 3,00–500 మధ్యలో ఉన్నాయి. కాగా, ఎయిర్‌‌‌‌టెల్‌‌, జియో తమ కస్టమర్లకు బేస్‌‌ ప్లాన్‌‌తోనే అన్‌‌లిమిటెడ్‌‌ డేటా వాడకాన్ని ఆఫర్‌‌‌‌ చేస్తున్నాయి.

ఒటీటీ ఆఫర్లతో ఎర..

బేస్‌‌ ప్లాన్‌‌ ధరను తగ్గించిన జియో ఫైబర్‌‌‌‌, తమ మిడ్‌‌, హై ఎండ్‌‌ ప్లాన్ల టారిఫ్‌‌లను 15–18 శాతం పెంచింది. దీంతో కంపెనీ మిడ్‌‌ ప్లాన్‌‌ రూ. 999 కి, రూ. హై ఎండ్‌‌ ఫ్లాన్‌‌ రూ. 1,499 కి చేరుకుంది. ఈ ప్లాన్లతో పాటే వివిధ  ఓవర్‌‌‌‌ ది టాప్‌‌(ఓటీటీ) యాప్‌‌లకు సబ్‌‌స్క్రిప్షన్‌‌ను ఫ్రీగా ఇస్తోంది.  జియో ఆఫర్‌‌‌‌ చేస్తున్న బేస్‌‌ ప్లాన్‌‌ కంటే ఎయిర్‌‌‌‌టెల్‌‌ బేస్‌‌ ప్లాన్‌‌ 25 శాతం ఎక్కువ కాస్ట్‌‌గా ఉంది. కానీ కంపెనీ ఆఫర్‌‌‌‌ చేస్తున్న రూ. 999 ప్లాన్‌‌, జియో రూ. 999 ప్లాన్‌‌ కంటే ఎక్కువ స్పీడ్‌‌ను ఆఫర్‌‌‌‌ చేస్తోంది. హై ఎండ్‌‌ ప్లాన్స్‌‌తో రీఛార్జ్‌‌ చేసుకున్న వారికి నెట్‌‌ఫ్లిక్స్‌‌, అమెజాన్‌‌ ప్రైమ్‌‌, డిస్నీ హాట్‌‌స్టార్‌‌‌‌ వంటి టాప్‌‌ ఓటీటీ ప్లాట్‌‌ఫామ్ సబ్‌‌స్క్రిప్షన్‌‌ను జియో ఫైబర్ అందిస్తోంది. కొత్త యూజర్లకైతే 30 రోజుల పాటు ఫ్రీ ట్రయల్స్‌‌తో పాటు, అమెజాన్‌‌ ప్రైమ్‌‌, నెట్‌‌ఫ్లిక్స్‌‌ వంటి ఓటీటీ యాప్స్‌‌కు సబ్‌‌స్క్రిప్షన్‌‌ ఆఫర్‌‌‌‌ చేస్తోంది. ఈ ఆఫర్లను రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్స్‌‌కు ఇస్తోంది.  జియో ఫైబర్‌‌‌‌తో పోటీ పెరగడంతో భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌ కూడా బ్రాడ్‌‌ బ్యాండ్ ప్లాన్లతో పాటే జీ5, డిస్నీ+ హాట్‌‌స్టార్‌‌‌‌,అమెజాన్ ప్రైమ్‌‌ వంటి ఓటీటీ ప్లాట్‌‌ఫామ్స్‌‌ సబ్‌‌స్క్రిప్షన్‌‌ను ఆఫర్‌‌‌‌ చేస్తోంది.వీటిని రూ. 999 ప్లాన్‌‌ నుంచి ఆఫర్‌‌‌‌ చేస్తోంది. ఈ కంపెనీ నెట్‌‌ప్లిక్స్‌‌ను ఆఫర్‌‌‌‌ చేయడం లేదు. జియో తన రూ. 1,499 ప్లాన్‌‌తో  నెట్‌‌ఫ్లిక్స్‌‌ సబ్‌‌స్క్రిప్షన్‌‌ను ఆఫర్‌‌‌‌ చేస్తోంది. ట్రాయ్​ డేటా ప్రకారం ఇండియాలో 2.24 కోట్ల మంది బ్రాడ్ బ్యాండ్‌‌ సబ్‌‌స్క్రయిబర్లు ఉన్నారు. ఈ సెగ్మెంట్‌‌లో బీఎస్‌‌ఎన్‌‌ఎల్‌‌కు 51.75 శాతం వాటా ఉంది. ఈ కంపెనీకి 1.6 కోట్ల మంది సబ్‌‌స్క్రయిబర్లున్నారు. సెకెండ్‌‌ ప్లేస్‌‌లో భారతీ ఎయిర్‌‌‌‌టెల్‌‌ ఉంది. ఈ కంపెనీ బ్రాడ్‌‌ బ్యాండ్ సబ్‌‌స్క్రయిబర్ల బేస్‌‌ 24.2 లక్షలు.

For More News..

ఓ వైపు ప్రాక్టీస్‌ మరోవైపు రిఫ్రెష్‌ మెంట్‌

వందో విజయం సాధించిన సెరెనా

తెలంగాణలో మరో 2,479 కరోనా కేసులు.. 10 మంది మృతి