ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ రికార్డ్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌‌‌‌‌‌‌‌

ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ రికార్డ్.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ:  భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌‌‌‌‌‌‌‌గా అవతరించింది. జీఎస్​ఎంఏ లెక్కల ప్రకారం ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ వినియోగదారుల సంఖ్య 65 కోట్లకు చేరింది. భారత్ నుంచి 36.8 కోట్ల మంది, ఆఫ్రికాలోని 14 దేశాల్లో 17.9 కోట్ల మంది ఈ సేవలు వాడుతున్నారు.

 శాటిలైట్ బ్రాడ్‌‌‌‌‌‌‌‌బాండ్ సేవల కోసం స్పేస్ ఎక్స్, యూటెల్,​ శాట్ వన్ వెబ్ సంస్థలతో ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ ఒప్పందం చేసుకుంది. మారుమూల ప్రాంతాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది.