ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్‌ను ప్రారంభించిన ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్‌ను ప్రారంభించిన ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ టీవీ ప్లాట్‌ఫామ్‌ ‘ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్‌’గా మారింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బండిల్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది ఎయిర్‌టెల్. జియో ఫైబర్‌, అమెజాన్ ప్రైమ్‌కు పోటీగా 1 జీబీపీఎస్ వరకు వేగంతో అన్‌లిమిటెడ్ డేటాతో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ 4కే హైబ్రిడ్ బాక్స్ ధర రూ.3,999. సెట్ టాప్ బాక్స్, ఓటీటీ కంటెంట్ కలిపి ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను ఎయిర్‌టెల్ రూపొందించింది.

ఈ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ అన్నిరకాల టీవీలని స్మార్ట్ టీవీగా చేస్తుంది. వినియోగదారులు అన్ని లైవ్ టీవీ ఛానెల్‌లకు చూడగలుగుతారు. 500 టీవీ ఛానెళ్లతో పాటు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్‌లో 10,000 పైగా సినిమాలు, షోస్ చూడొచ్చు. జీ5, ఎరోస్ నౌ, హంగామా ప్లే లాంటి ఓటీటీ కంటెంట్ పార్ట్‌నర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది ఎయిర్‌టెల్. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్ లాంటి యాప్స్ కూడా ఉంటాయి