నీట్ నిర్వహణలో అవకతవకలు జరిగాయ్... ఏఐఎస్ఎఫ్

నీట్ నిర్వహణలో అవకతవకలు జరిగాయ్... ఏఐఎస్ఎఫ్

ఓయూ, వెలుగు: నీట్–2024 నిర్వహణలో అవకతవకలు జరిగాయని, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. నిర్వహణ లోపానికి బాధ్యత వహిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుబోత్ కుమార్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. బుధవారం ఓయూలో ఏఐఎస్ఎఫ్​నాయకులు నెల్లి సత్య మీడియాతో మాట్లాడారు. నీట్ నిర్వహించిన తీరు, ఫలితాలు వెల్లడించిన విధానంలో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు.

మే 4కు ముందే నీట్ క్వశ్చన్​పేపర్ లీక్ అయిందని, చాలా మంది స్టూడెంట్లకు చినిగిన ఓఎంఆర్ షీట్లు ఇచ్చారని, కొన్ని సెంటర్లలో సకాలంలో ఎగ్జామ్​నిర్వహించలేదని ఆరోపించారు. జూన్​14న ప్రకటించాల్సిన ఫలితాలను, జూన్ 4న ఎందుకు ప్రకటించారని ప్రశ్నించారు. ఒకే సెంటర్​లో ఎగ్జామ్​రాసిన ఆరుగురు స్టూడెంట్లకు 720 కి 720 ఎలా వస్తాయని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి, సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాచి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​చేశారు. నీట్​ను మళ్లీ నిర్వహించాలని కోరారు. సమావేశంలో ఏఐఎస్ఎఫ్ ఓయూ సహాయ కార్యదర్శి భగత్, నాయకులు శ్రీకాంత్, నాగరాజు, రమేశ్, దిలీప్, శశివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

సీబీఐతో విచారణ జరపాలి: ఏబీవీపీ

నీట్ నిర్వహణపై వస్తున్న ఆరోపణలపై కేంద్రం స్పందించాలని, సీబీఐతో విచారణ జరిపించాలని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ అలివేలి రాజు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, నిజానిజాలను తేల్చాలన్నారు. దాదాపు 67 మందికి ఫుల్​మార్స్స్​వచ్చాయని, ఇలా జరగడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారన్నారు.