జక్కన్న మూవీలో ఐశ్వర్యారాయ్..?

జక్కన్న మూవీలో ఐశ్వర్యారాయ్..?

బాలీవుడ్ ​బ్యూటీ ఐశ్వర్యారాయ్,సూపర్ స్టార్ రజనీకాంత్​ కాంబోలో 'రోబో' సినిమా వచ్చిన విషయం తెలిసింది. అప్పట్లో ఈ మూవీ భారీ హిట్ కొట్టింది. అయితే చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబో రిపీట్ కాబోతుందని వార్తలు చక్రర్లు కొడుతున్నాయి. ఈ న్యూస్ పై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలావుంటే.. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రాజమౌళి తదుపరి చిత్రంలో ఐశ్వర్యారాయ్ లీడ్ రోల్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా స్ర్కిప్ట్ వర్క్ జరుగుతోంది. విజయేంద్ర ప్రసాద్ అండ్ టీమ్ ఇప్పుడు ఆ పనిలోనే ఉంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్టు సమాచారం. అయితే ఈ మూవీలోనే ఐష్​  నటించబోతోందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచిచూడాల్సిందే.