
కమర్షియల్ సినిమాలు చేయాలని ఆరాటపడదు. గ్లామర్ పాత్రలకి ఒప్పుకోదు. అయినా కూడా చేతినిండా సినిమాలతో ఎప్పుడూ బిజీగానే ఉండటం ఐశ్వర్యా రాజేష్‌కే చెల్లింది. పైగా ఆమె చేసేవాటిలో ఎక్కువశాతం ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలే ఉండటం విశేషం. రీసెంట్‌గా రెండు సినిమాల అప్‌డేట్స్‌తో సర్‌ప్రైజ్ చేసింది ఐశ్వర్య. ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో జియేన్ కృష్ణకుమార్ రూపొందిస్తున్న డార్క్ కామెడీ థ్రిల్లర్‌లో హీరోయిన్‌గా ఐశ్వర్యను తీసుకున్నట్లు అనౌన్స్‌మెంట్ వచ్చింది. అయితే బాలాజీ, ఐశ్వర్య జంటగా కనిపించరట. ఇద్దరూ రెండు ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారట. ఈ నెల 23 నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది.
ఇక దినేష్ లక్ష్మణన్ అనే కొత్త డైరెక్టర్ తీస్తున్న ‘తీయవర్ కుళైగళ్ నడుంగా’లోనూ లీడ్ రోల్ చేస్తోంది ఐశ్వర్య. ఆటిజమ్ ఉన్న పిల్లలు చదివే స్కూల్‌లో టీచర్‌గా కనిపించ బోతోంది. ఆ క్యాంపస్‌లో జరిగే ఓ క్రైమ్ చుట్టూ తిరిగే ఈ చిత్రంలో అర్జున్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ని కూడా రీసెంట్‌గా రిలీజ్ చేశారు. వీటితో పాటు మోహన్‌దాస్, డ్రైవర్ జమున, ద గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రాల్లోనూ నటిస్తోంది ఐశ్వర్య.