డిజిటల్​ పేమెంట్స్​లో హైదరాబాద్​ దూకుడు

డిజిటల్​ పేమెంట్స్​లో హైదరాబాద్​ దూకుడు

న్యూఢిల్లీ:  రవాణా సేవలకు డిజిటల్​ పేమెంట్లను వాడుతున్న మెగాసిటీల్లో హైదరాబాద్​లో మొదటిస్థానంలో నిలిచింది. మిగతా సిటీలన్నింటికంటే ఇక్కడే డిజిటల్​ పేమెంట్ల చెల్లింపు ఎక్కువగా ఉందని ‘ఈజ్​ ఆఫ్​ మూవింగ్​ ఇండెక్స్​ ఇండియా రిపోర్ట్​’ తెలిపింది. దీనిని ఓఎంఐ ఫౌండేషన్​ విడుదల చేసింది. తరువాతిస్థానంలో కోల్​కతా ఉంది. చిన్న నగరాల్లో ఐజ్వాల్​ మొదటిస్థానంలో ఉంది. షిమ్లా, కోహిమా నగరాల్లోనూ మొబిలిటీకి, డెలివరీలకు డిజిటల్​ పేమెంట్లను విరివిగా వాడుతున్నారు. 

చాలా నగరాల్లో స్మార్ట్​ఫోన్​ యూజర్లు రవాణా, డెలివరీల కోసం మూడుకుపైగా యాప్స్​ వాడుతున్నారు. ఈ రిపోర్ట్​ కోసం 18 నగరాలకు చెందిన 50,488 మంది నుంచి అభిప్రాయాలను తీసుకున్నామని ఓఎంఐ తెలిపింది. ‘బూమింగ్​ సిటీస్​’ కేటగిరీలో కన్పూర్​, పట్నా, లక్నోలు డిజిటల్​ చెల్లింపుల్లో ముందజంలో ఉన్నాయి. నాగపూర్​ నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో మెజారిటీ యూజర్లు మూడు కంటే ఎక్కువ యాప్స్​వాడుతున్నట్టు వెల్లడించారు. 

ఎలక్ట్రిక్​ వెహికల్స్​ మారటం ఇష్టమని అహ్మదాబాద్​లో ఎక్కువ మంది చెప్పారు. లూధియానాలో మహిళలు పబ్లిక్​ ట్రాన్స్​పోర్ట్​ను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్టు ఈ స్టడీ తేల్చింది. ఈవీల వాడకం విషయంలో ఐజ్వాల్​ మొదటిస్థానంలో నిలిచింది.