వరల్డ్​ బ్యాంక్ కొత్త​ ప్రెసిడెంట్​ అజయ్​ బంగ

వరల్డ్​ బ్యాంక్ కొత్త​ ప్రెసిడెంట్​ అజయ్​ బంగ

న్యూఢిల్లీ: వరల్డ్​ బ్యాంక్​ కొత్త ప్రెసిడెంట్​గా అజయ్​ బంగ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈయన అమెరికాలో సెటిలైన ఇండియన్​.  గ్లోబల్​ ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్​ను ఒక ఇండియన్​ లీడ్​ చేయడం ఇదే మొదటిసారి. ​ వరల్డ్​బ్యాంక్​, ఇంటర్నేషనల్​ మానిటరీ ఫండ్​లను గ్లోబల్​ ఫైనాన్షియల్​ ఇన్​స్టిట్యూషన్స్​గా పిలుస్తాము. అజయ్​ బంగ ఈ పదవిలో అయిదేళ్లపాటు కొనసాగుతారు. అమెరికా ప్రెసిడెంట్​ జో బైడెన్​ ఈయనను వరల్డ్​ బ్యాంక్​ ప్రెసిడెంట్​ పదవికి నామినేట్​ చేశారు.

వరల్డ్​ బ్యాంకులో అడుగు పెడుతున్న అజయ్​ బంగకు స్వాగతం చెబుతూ వరల్డ్​ బ్యాంకు ఒక ట్వీట్​ చేసింది. వరల్డ్​ బ్యాంకు ప్రెసిడెంట్​ అజయ్ ​బంగకు ఆల్​ ది బెస్ట్​ చెబుతూ ఐఎంఎఫ్​ మేనేజింగ్​ డైరెక్టర్​ క్రిస్టలినా జార్జివా కూడా ట్వీట్​ చేశారు. వరల్డ్ ​బ్యాంకులో చేరడానికి ముందు జనరల్​ అట్లాంటిక్​ వైస్ ​చైర్మన్​, మాస్టర్​కార్డ్​కు సీఈఓగా వ్యవహరించారు. అమెరికన్​ రెడ్​క్రాస్​, క్రాఫ్ట్​ ఫుడ్స్​, డౌ ఇంక్​ బోర్డులలోనూ గతంలో అజయ్​ బంగ ఉన్నారు.ఈయన  ది సైబర్​ రెడీనెస్​ ఇన్​స్టిట్యూట్​ కో–ఫౌండర్​ కూడా. తన కంట్రిబ్యూషన్స్​కు ఆయన 2016 లో పద్మశ్రీ కూడా  అందుకున్నారు.