Shaitaan Trailer: యువ‌తిపై వ‌శీక‌ర‌ణ మంత్రం..థ్రిల్లింగ్‌ అంశాలతో సైతాన్‌ ట్రైలర్‌

Shaitaan Trailer: యువ‌తిపై వ‌శీక‌ర‌ణ మంత్రం..థ్రిల్లింగ్‌ అంశాలతో సైతాన్‌ ట్రైలర్‌

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgn), మాధవన్ (Madhavan), జ్యోతిక (Jyotika) లీడ్‌‌ రోల్స్‌‌లో నటిస్తున్న చిత్రం సైతాన్‌ (Shaitaan)‌. క్వీన్, సూపర్ 30, గుడ్ బై లాంటి చిత్రాలను తీసిన వికాస్ బహెల్ ఈ సినిమాని తెరకెక్కించాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. 

థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ట్రైలర్‌ ఆడియాన్స్లో ఇంట్రెస్ట్ పెంచుతోంది. మాధ‌వ‌న్ ఒక సైతాన్. అత‌డు దేవ‌గ‌న్ కుమార్తెను వ‌శ‌ప‌రుచుకుంటాడు. యువ‌తిపై వ‌శీక‌ర‌ణ మంత్రాన్ని ప్ర‌యోగిస్తాడు. అనూహ్యంగా ఆ యువ‌తి ఇంట్లోనే అత‌డు సాగించే భ‌యాన‌క‌మైన ఆట ఏమిట‌న్న‌ది ఈ ట్రైల‌ర్లో చూడొచ్చు.

వెకేషన్ కోసం మారుమూల గ్రామానికి వెళ్లిన కుటుంబం..ఓ అపరిచిత వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడతారు. అతను ప్రయోగించిన డార్క్ మేజిక్‌‌ నుంచి ఆ కుటుంబం ఎలా బయటపడింది అనేది అసలు కథ.

గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలై సక్సెస్‌‌ సాధించిన ‘వశ్‌‌’ అనే గుజరాతీ సినిమాకు సైతాన్‌‌ రీమేక్ గ తెరకెక్కింది. ఇక ఒరిజినల్ మూవీలో ఇంపార్టెంట్ రోల్ చేసిన గుజరాతీ నటి జాంకీ బోడివాలా, హిందీలోనూ నటిస్తోంది. ఇక పాతికేళ్ల తర్వాత ఈ సినిమాతో తిరిగి బాలీవుడ్‌‌లో రీ ఎంట్రీ ఇస్తోంది జ్యోతిక. అజయ్ దేవగన్‌‌కు జంటగా ఆమె నటిస్తోంది. జియో స్టూడియోస్‌‌ సమర్పణలో అజయ్ దేవగన్‌‌, జ్యోతి దేశ్‌‌పాండే, అభిషేక్ పాఠక్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మార్చి 8న ఈ సినిమా రిలీజ్ కానుంది.