జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు కేంద్ర ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. ఆయన పదవి కాలాన్ని మరో ఐదేళ్లు పొడగిస్తూ.. ఆయనకు కేబినెట్ హోదా కల్పించింది. దేశ భద్రత వ్యవహారాల్లో ఆయన చేసిన విశేష కృషికి దోవల్ కు కేబినెట్ హోదా ఇచ్చినట్లు చెప్పింది కేంద్రం.