డేకేర్ సెంటర్లతో జాగ్రత్త.. 15 నెలల చిన్నారిని కొట్టి-కొరికిన సిబ్బంది.. తల్లిదండ్రులు కన్నీరు

డేకేర్ సెంటర్లతో జాగ్రత్త.. 15 నెలల చిన్నారిని కొట్టి-కొరికిన సిబ్బంది.. తల్లిదండ్రులు కన్నీరు

నోయిడాలోని ఒక డేకేర్‌ సెంటర్లో 15 నెలల చిన్నారిపై ఘోరం జరిగింది. అసలు మాటలు కూడా సరిగ్గారాని ఓ చిన్నారి తొడలపై గాయాలు, పళ్ళకాటు గుర్తులు ఉండటంతో  షాకైన తల్లితండ్రులు వెంటనే డేకేర్‌లోని సీసీటీవీ ఫుటేజీ చూడగా అటెండర్ ఆ చిన్నారిని కొట్టడం, కింద పడేయడం కనిపించింది. దింతో డేకేర్‌లోని మహిళా పై ఫిర్యాదు చేయగా అటెండర్‌ను పోలీసులు అరెస్ట్  చేసారు. 

వివరాలు చూస్తే ఈ ఘటన నోయిడాలోని సెక్టార్ 137లోని పారస్ టిరియా రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్న డేకేర్‌లో జరిగింది. ఈ డేకేర్‌ను రెసిడెంట్స్ అసోసియేషన్ నడుపుతోంది. తల్లిదండ్రులు పిల్లలను ఇక్కడ వదిలిపెట్టి ఉద్యోగాలకు వెళ్తుంటారు. అయితే ఎప్పటిలాగే ఓ రోజు కూతురిని డేకేర్‌లో వదిలేసి వెళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చి ఇంటికి వెళ్ళాక 

చిన్నారి తల్లిదండ్రులు కూతురి తొడలపై ఉన్న గుర్తులు  చూసి అది అలెర్జీ అని అనుకున్నారు. తర్వాత డాక్టరుకి చూపించగా అవి పళ్ళకాటు గుర్తులని తెలిసింది. దీంతో వెంటనే డేకేర్‌లోని సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా, అటెండర్ చిన్నారిని కొట్టడం, కింద పడేయడం చూసి షాక్‌కు గురయ్యారు. ఆ ఫుటేజీలో చిన్నారి ఏడుస్తున్నట్లు కూడా కనిపిస్తుంది. 

తర్వాత చిన్నారి తల్లిదండ్రులు సెక్టార్ 142 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే  డేకేర్ యజమాని కూడా ఈ విషయంపై స్పందించలేదని ఆరోపించారు. మా కూతురి పై జరిగిన దాడి గురించి అడిగినప్పుడు డేకేర్ యజమాని, అటెండర్ దుర్భాషలాడి బెదిరించారని కూడా చెప్పారు. పోలీసులు చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించి అటెండర్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నారు. 

►ALSO READ | క్విక్ సర్వీస్: అలా15 నిమిషాల్లో వచ్చి అంట్లు తోమేస్తారు.. ఇల్లు తుడిచేస్తారు..! ఇంకా..

మా కూతురిని రోజుకు రెండు గంటలు డేకేర్‌కు పంపే వాళ్ళం,  ఇందుకు 3 వేల 500 కడుతున్నాం. అక్కడ ముగ్గురు టీచర్లు ఉన్నారు, కానీ చిన్నారిని అటెండర్ చూసుకుంటుందని మాకు తెలియదని అన్నారు.  

మరో చిన్నారి విషయంలో ఇలా జరగకుండా డేకేర్ యజమాని, అటెండర్‌పై చర్యలు తీసుకోవాలి. మా కూతురిని కొట్టిన అటెండర్ ఒక  మైనర్. చిన్న పిల్లలను చూసుకునేందుకు 18 ఏళ్ళు పైబడిన వారిని మాత్రమే నియమించుకునేందుకు  అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.