సరిహద్దు వివాదంపై అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు

సరిహద్దు వివాదంపై అజిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు

మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డిప్యూటీ సీఎం, ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చాయి. కర్నాటక సరిహద్దులోని కొన్ని ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడేవారు ఉన్నారని, ఆ ప్రాంతాలను కచ్చితంగా మహారాష్ట్రలో కలిపేస్తామని అజిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

"బెల్గాం, నిపాణీ, కార్వార్ తదితర ప్రాంతాల్లో మరాఠీ మాట్లాడే వారున్నారు. ఇవి కర్నాటక సరిహద్దు ప్రాంతాలు. ఇప్పటికీ అవి మహారాష్ట్రలో భాగం కాలేదు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  హామీ ఇస్తున్నాను. మహారాష్ట్రలో భాగమయ్యేందుకు ప్రజలు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతిస్తాం" అని పవార్ ప్రకటించారు.
ప్రస్తుతం కర్నాటకలో ఉన్న బెల్గాం తదితర సరిహద్దు ప్రాంతాలు మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవి. మరాఠీ మాట్లాడే వారు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాలన్నీ మహారాష్ట్రకు చెందినవని, అందుకే ఆ రాష్ట్రంలో విలీనం చేయాలని మహారాష్ట్ర ఏకీకరణ సమితి డిమాండ్ చేస్తోంది.