ముంబై: బారామతి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి కేసులో.. విమానానికి చెందిన బ్లాక్ బాక్స్‌ను ఘటనాస్థలం నుంచి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ (ఎంవోసీఏ) స్వాధీనం చేసుకుంది. విమాన ప్రమాదాన్ని చివరి క్షణంలో పైలట్లు గుర్తించారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సీనియర్ అధికారి ఒకరు గురువారం వెల్లడించారు.
ప్రమాదాన్ని గమనించిన వెంటనే పైలట్ ‘ఓహ్ షిట్’ అన్నట్టుగా కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్)లో మాటలు రికార్డయ్యాయని చెప్పారు. ఈ మాటలు కో-పైలట్ కెప్టెన్ శాంభవి పాఠక్వి కావచ్చని అంచనా వేస్తున్నారు.
అయితే, అప్పటికే పరిస్థితి చేజారిపోవడంతో విమానం కూలి.. అందులో ఉన్నవారంతా మృతిచెందారని వివరించారు. ఘటనపై ఏయిర్ క్రాఫ్ట్ ఆక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) కూడా దర్యాప్తు చేపట్టింది. ప్రస్తుతం బ్లాక్ బాక్స్‌ను ఢిల్లీలోని ల్యాబ్‌లో విశ్లేషిస్తున్నది.
