బల పరీక్షకు ముందే అజిత్ పవార్ రాజీనామా!

బల పరీక్షకు ముందే అజిత్ పవార్ రాజీనామా!

మహారాష్ట్ర రాజకీయం మరో మలుపు తిరిగింది. ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉన్నట్టుండి బీజేపీకి హ్యండ్ ఇచ్చారు. రేపే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని సుప్రీం ఆదేశించిన తరుణంలో అజిత్‌పైనే కమలం పార్టీ నమ్మకం పెట్టుకుంది. ఎన్సీపీ ఎమ్మెల్యేలను తన వెంట తీసుకొస్తాడన్న ఆశల్లో ఉంది. కానీ ఈ సమయంలో అజిత్ పవార్ సడన్‌గా డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తన రాజీనామా లేఖను సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు పంపినట్లు సమాచారం అందుతోంది. కుటుంబసభ్యుల ఒత్తిడితో ఆయన  పదవికి రాజీనామా చేసి, బీజేపీ నుంచి దూరం జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో ఫడ్నవిస్‌ కూడా ఇవాళ గవర్నర్‌ని కలిసి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి.

MORE NEWS:

చంద్రయాన్ ఫెయిల్ అయినా.. ఈ సూర్యుడి విజయంపై ధీమా

ఎక్కిళ్లు.. ఎందుకొస్తాయి? సైన్స్ ఏం చెబుతోంది?: రెమిడీ ఏంటీ!

ఎన్సీపీ-కాంగ్రెస్-శివసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని శుక్రవారం రాత్రి రెడీ అయిన తరుణంలో అజిత్ పవార్ ఝలక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటికే ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికై ఉన్న ఆయన రాత్రికి రాత్రి బీజేపీతో జట్టుకట్టారు. శనివారం ఉదయం 5.47 గంటలకు సీఎంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్‌, డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్‌లతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యరీ ప్రమాణం చేయించారు. బల నిరూపణకు నవంబరు 30 వరకు సమయం ఇచ్చారు. దీంతో అజిత్ పవార్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లారంటూ ఆయనను శాసనసభాపక్ష నేత పదవి నుంచి తొలగించింది ఎన్సీపీ. బీజేపీకి బలం లేకపోయినా ప్రమాణస్వీకారం చేయించారని, వెంటనే బల నిరూపణకు ఆదేశించాలని మూడు పార్టీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం బుధవారమే బల నిరూపణకు ఆదేశించింది.