బ్యాంక్ రాబరీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో అజిత్ కొత్త సినిమా

బ్యాంక్ రాబరీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో అజిత్ కొత్త సినిమా

ఒక దర్శకుడితో కానీ నిర్మాతతో కానీ కాంబినేషన్ వర్కవుటైతే వాళ్లని రిపీట్ చేయడం కామన్. అయితే వరుసగా మూడు చిత్రాలు చేయడానికి సాధారణంగా ఏ హీరో రెడీ అవ్వడు. కానీ అజిత్ అయ్యారు. నేర్కొండ పార్వై, వలిమై చిత్రాల తర్వాత ఆ దర్శకుడు వినోద్, నిర్మాత బోనీ కపూర్‌‌‌‌‌‌‌‌లతో మరో మూవీకి కమిటయ్యారాయన. ‘ఏకే 61’ అనే వర్కింగ్ టైటిల్‌‌‌‌తో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఇటీవలే ఫైనల్ షెడ్యూల్‌‌‌‌ను స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా కొన్ని యాక్షన్ సీన్స్‌‌‌‌ని అరకులో ప్లాన్ చేశారు. త్వరలోనే టీమ్ అంతా అరకు చేరుకోనున్నారట. బ్యాంక్ రాబరీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ ఫిమేల్ లీడ్‌‌‌‌గా కనిపించనున్నారు. అజయ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. త్వరలోనే టైటిల్‌‌‌‌తో పాటు ఫస్ట్ లుక్‌‌‌‌ పోస్టర్ రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీపావళికి సినిమా విడుదల చేయాలనుకున్నారు కానీ షూటింగ్ డిలే అవడంతో పోస్ట్‌‌‌‌పోన్ అయ్యే చాన్సెస్‌‌‌‌ కనిపిస్తున్నాయి. అజిత్‌‌‌‌కి పొంగల్ సీజన్ కలిసొస్తుంది కాబట్టి అప్పటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.