దర్గాలో మహిళ డ్యాన్స్..ఒక్కసారిగా ఊపొచ్చి..రెచ్చిపోయింది

దర్గాలో మహిళ డ్యాన్స్..ఒక్కసారిగా ఊపొచ్చి..రెచ్చిపోయింది

అజ్మీర్ షరీఫ్ దర్గా...ముస్లిం పవిత్ర ప్రార్థనా స్థలం. ఇలాంటి స్థలంలో ప్రజలు ఆ స్థలం పవిత్రను కాపాడాలి. కానీ ఓ యువతి మాత్రం చిల్లరగా ప్రవర్తించింది. ప్రార్థనా స్థలంలో పనికిమాలిన డ్యాన్స్ చేసింది. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఎక్కడ ఉన్నామన్న  సోయి లేకుండా డ్యాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్ అయింది. యువతి డ్యాన్స్ వివాదాస్పదమైంది. 

ఊపొచ్చి..

వీడియో ప్రకారం..అజ్మీర్ షరీఫ్ దర్గా ఆవరణలో గ్రే, పింక్ కుర్తా ధరించిన ఓ యువతి..ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంది. అయితే మొదట్లో సాధారణంగా నడిచిన యువతి..మ్యూజిక్ బీట్ కు ఊపొచ్చి అకస్మాత్తుగా స్టెప్పులేసింది.   ప్రార్థనా స్థలం అనే ధ్యాస కూడా లేకుండా బీట్స్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది. 


అజ్మీర్ ష‌రీఫ్ ద‌ర్గా వ‌ద్ద మ‌హిళ డ్యాన్స్ చేస్తున్న వీడియో వివాదాస్పద‌మైంది. ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో ఆ మ‌హిళపై పెద్దఎత్తున విమ‌ర్శలు చెల‌రేగాయి. మ‌హిళ తీరును మ‌సీదు నిర్వాహ‌కులు త‌ప్పుప‌ట్టారు. ప‌విత్ర ప్రార్థనా ప్రదేశ‌మ‌ని ఆ మ‌హిళ తెలుసుకోవాల‌ని ద‌ర్గా నిర్వాహ‌కులు సూచించారు.