
న్యూఢిల్లీ: 43 మంది పైలెట్లు సడెన్‌గా మానేయడంతో ఆకాశ్ ఎయిర్ తమ సర్వీస్‌లను తగ్గించింది. కొంత కాలం వరకు సర్వీస్‌లను తగ్గిస్తామని, దీని వలన మార్కెట్ వాటా పడిపోవచ్చని కంపెనీ తన ఉద్యోగులకు రాసిన మెమోలో పేర్కొంది. ఈ ఏడాది జులైలో ఆకాశ్ ఎయిర్ మార్కెట్ వాటా 5.2 శాతంగా ఉండగా, ఆగస్టులో 4.2 శాతానికి తగ్గింది. కొంత మంది పైలెట్లు సడెన్‌గా మానేశారని, నోటీస్ పీరియడ్ సర్వ్ చేయలేదని ఆకాశ్ ఎయిర్ సీఈఓ వినయ్ దుబే అన్నారు.
జులై నుంచి సెప్టెంబర్ మధ్య ఫ్లయిట్ సర్వీస్‌లలో అంతరాయం ఏర్పడిందని చెప్పారు. గత నెల రోజుల నుంచి పరిస్థితులను చక్కబరుస్తున్నామని అన్నారు. నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకుండా మానేసిన పైలెట్‌లపై కంపెనీ లీగల్ యాక్షన్ తీసుకుంటోంది. మరోవైపు ఇంటర్నేషనల్ సర్వీస్‌లను డిసెంబర్ నుంచి ఆకాశ్ ఎయిర్ స్టార్ట్ చేయనుంది. మొదటి డెస్టినేషన్ మిడిల్ ఈస్ట్ దేశాలు.