వినూత్న కథతో విలయ తాండవం

వినూత్న కథతో విలయ తాండవం

కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, ‘పుష్ప’ ఫేమ్ జగదీష్ లీడ్ రోల్స్‌‌లో వీఎస్ వాసు తెరకెక్కిస్తున్న చిత్రం ‘విలయ తాండవం’. మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు నిర్మిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌‌ పోస్టర్‌‌‌‌ను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆకాష్ పూరి, భీమనేని శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. టైటిల్‌‌ తరహాలోనే పోస్టర్‌‌‌‌ కూడా పవర్‌‌‌‌ఫుల్‌‌గా ఉందని, కార్తీక్‌‌ రాజుకి ఈ చిత్రంతో పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నామని ఆకాష్,  భీమనేని బెస్ట్ విషెస్ చెప్పారు. 

ఓ వినూత్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తోందని కార్తీక్ రాజు చెప్పాడు. పోస్టర్ ఎంత పవర్‌‌‌‌ఫుల్‌‌గా ఉందో సినిమా కూడా అంతే పవర్‌‌‌‌ఫుల్‌‌ కంటెంట్‌‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకనిర్మాతలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ గ్యానీ,  కొరియోగ్రాఫర్స్‌‌ ఆట సందీప్,  కపిల్ తదితరులు పాల్గొన్నారు.