ఆకాశ్‌‌‌‌‌‌‌‌ అడ్డుకున్నా.. రూట్ చిక్కలే

ఆకాశ్‌‌‌‌‌‌‌‌ అడ్డుకున్నా.. రూట్ చిక్కలే
  •    తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 302/7
  •     10 బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో 3 వికెట్లు తీసిన ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌
  •     సెంచరీతో ఆదుకున్న జో రూట్‌‌‌‌‌‌‌‌

రాంచీ: ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ నాలుగో టెస్ట్‌‌‌‌‌‌‌‌ రసవత్తరంగా మొదలైంది. ఓవైపు అరంగేట్రం పేసర్‌‌‌‌‌‌‌‌ ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌ (3/70) పది బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో మూడు కీలక వికెట్లు పడగొట్టి టీమిండియాకు అద్భుతమైన ఆరంభాన్నిస్తే.. మరోవైపు సీనియర్‌‌‌‌‌‌‌‌ జో రూట్‌‌‌‌‌‌‌‌ (226 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 9 ఫోర్లతో 106 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) సెంచరీతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ను ఆదుకున్నాడు. ఈ ఇద్దరి హోరాహోరీ పోరుతో శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే టైమ్‌‌‌‌‌‌‌‌కు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 90 ఓవర్లలో 302/7 స్కోరు చేసింది. రూట్‌‌‌‌‌‌‌‌తో పాటు ఒలీ రాబిన్సన్‌‌‌‌‌‌‌‌ (31 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నాడు.  బెన్‌‌‌‌‌‌‌‌ ఫోక్స్‌‌‌‌‌‌‌‌ (47), జాక్‌‌‌‌‌‌‌‌ క్రాలీ (42) ఫర్వాలేదనిపించారు.

10 బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో 3 వికెట్లు..

టాస్‌‌‌‌‌‌‌‌ గెలిచిన ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌ ఎంచుకోగా, ఇండియా ఈ సిరీస్‌‌‌‌‌‌‌‌లో ఆకాశ్‌‌‌‌‌‌‌‌ రూపంలో నాలుగో కొత్త పేసర్‌‌‌‌‌‌‌‌కు చాన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. ఆరంభంలో కొత్త బాల్‌‌‌‌‌‌‌‌తో మంచి బౌన్స్‌‌‌‌‌‌‌‌, స్వింగ్‌‌‌‌‌‌‌‌తో చెలరేగిన ఆకాశ్‌‌‌‌‌‌‌‌.. ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టాపార్డర్‌‌‌‌‌‌‌‌ను ముప్పు తిప్పలు పెట్టాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో సిరాజ్‌‌‌‌‌‌‌‌ (2/60) లైన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌లో ఇబ్బందిపడినా తర్వాత కుదురుకున్నాడు. డ్రెస్సింగ్‌‌‌‌‌‌‌‌ రూమ్‌‌‌‌‌‌‌‌ ఎండ్‌‌‌‌‌‌‌‌ నుంచి బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఆకాశ్‌‌‌‌‌‌‌‌ 10వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో బెన్‌‌‌‌‌‌‌‌ డకెట్‌‌‌‌‌‌‌‌ (11), ఒలీ పోప్‌‌‌‌‌‌‌‌ (0)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపాడు.

అప్పటి వరకు నిలకడగా ఆడుతూ హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ దిశగా సాగుతున్న జాక్‌‌‌‌‌‌‌‌ క్రాలీని 12వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో దెబ్బకొట్టాడు. పది బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో ఈ ముగ్గురు ఔట్‌‌‌‌‌‌‌‌ కావడంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 57/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో రూట్‌‌‌‌‌‌‌‌ జట్టు బాధ్యత తీసుకున్నాడు. రెండో గంటలో స్పిన్నర్లు జడేజా (1/55), అశ్విన్‌‌‌‌‌‌‌‌ (1/88)ను దీటుగా ఎదుర్కొన్న రూట్‌‌‌‌‌‌‌‌ వెయిటింగ్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్లాడు.

క్రీజులో ఉన్నంతసేపు బెయిర్‌‌‌‌‌‌‌‌స్టో (38) కూడా నిలకడగా ఆడే ప్రయత్నం చేశాడు. కానీ సెషన్‌‌‌‌‌‌‌‌ చివర్లో స్పిన్నర్లు ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌కు ఝలక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చారు. 22వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో అశ్విన్‌‌‌‌‌‌‌‌.. బెయిర్‌‌‌‌‌‌‌‌స్టోను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసి నాలుగో వికెట్‌‌‌‌‌‌‌‌కు 52 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేశాడు. 25వ ఓవర్లో జడేజా.. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ బెన్‌‌‌‌‌‌‌‌ స్టోక్స్‌‌‌‌‌‌‌‌ (3)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపడంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ 112/5తో లంచ్‌‌‌‌‌‌‌‌కు వెళ్లింది. 

రూట్ జోరు..

ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌పై ఇండియాకు పట్టు లభించినట్లు కనిపించినా రెండో సెషన్‌‌‌‌‌‌‌‌లో రూట్‌‌‌‌‌‌‌‌ అడ్డుగోడలా నిలబడ్డాడు. ఫోక్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి ఈ సెషన్‌‌‌‌‌‌‌‌లో టీమిండియా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. పేసర్లు, స్పిన్నర్లు ఎదురుదాడి మొదలుపెట్టినా రూట్‌‌‌‌‌‌‌‌ ఏమాత్రం తడబడలేదు. ఈ క్రమంలో కెరీర్‌‌‌‌‌‌‌‌లో 31వ సెంచరీ (219 బాల్స్‌‌‌‌‌‌‌‌లో)ని సాధించాడు. గత 15 ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ల్లో  అతనికిది  తొలి సెంచరీ.

మరో ఎండ్‌‌‌‌‌‌‌‌లో ఫోక్స్‌‌‌‌‌‌‌‌ కూడా అదే స్థాయిలో రూట్‌‌‌‌‌‌‌‌కు అండగా నిలబడ్డాడు. అయితే మూడో సెషన్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాదీ సిరాజ్‌‌‌‌‌‌‌‌ రివర్స్‌‌‌‌‌‌‌‌ స్వింగ్‌‌‌‌‌‌‌‌తో హడలెత్తించి ఈ జోడీని విడదీశాడు. 68వ ఓవర్లో అతను మిడ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌గా వేసిన బాల్‌‌‌‌‌‌‌‌ను ఫోక్స్‌‌‌‌‌‌‌‌ డిఫెన్స్‌‌‌‌‌‌‌‌కు ట్రై చేయగా, షార్ట్‌‌‌‌‌‌‌‌ మిడ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌లో జడేజా చేతుల్లోకి వెళ్లింది. దీంతో ఆరో వికెట్‌‌‌‌‌‌‌‌కు 113 రన్స్‌‌‌‌‌‌‌‌ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ ముగిసింది. 76వ ఓవర్‌‌‌‌‌‌‌‌లో అద్భుత బాల్‌‌తో హర్ట్‌‌‌‌‌‌‌‌లీ (13)ని క్లీన్‌‌‌‌‌‌‌‌ బౌల్డ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. చివర్లో రాబిన్సన్‌‌‌‌‌‌‌‌, రూట్‌‌‌‌‌‌‌‌ మరో వికెట్ పడకుండా  జాగ్రత్తగా ఆడటంతో ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ స్కోరు 300 దాటింది.

కష్టాలన్నీ దాటేసి.. ఆకాశ్‌‌మంత ఎత్తుకు

అరంగేట్రం టెస్టులోనే సెన్సేషనల్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో అదరగొట్టిన బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్‌‌‌‌‌‌‌‌ జీవితం సినిమా స్టోరీని మించేలా సాగింది. కష్టాలతో సావాసం చేస్తూ.. అనేక అడ్డంకులను దాటుకుంటూ తను ఈ స్థాయికి చేరుకున్న తీరు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. బీహార్‌‌‌‌‌‌‌‌లోని ససారమ్‌‌‌‌‌‌‌‌లో పుట్టిన ఆకాష్ దీప్‌‌‌‌‌‌‌‌కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే పిచ్చి. కానీ, తండ్రి రామ్‌‌‌‌‌‌‌‌జీ సింగ్ మాత్రం ‘క్రికెట్ తిండి పెడుతుందా? బుద్ధిగా చదువుకో’ అని వారించేవాడు.

రహస్యంగా క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడుతున్నాడని తెలిసి ఆకాశ్‌‌‌‌‌‌‌‌ను కొట్టేవాడు. పక్కింటి తల్లిదండ్రులు సైతం క్రికెట్‌‌‌‌‌‌‌‌ మాయలో పడి జీవితం నాశనం చేసుకుంటున్న ఆకాశ్‌‌‌‌‌‌‌‌ను కలవొద్దని తమ పిల్లలకు చెప్పేవారు. దాంతో,  ఉద్యోగం చేస్తాననే సాకుతో ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దుర్గాపూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లాడు. అక్కడ తన మామయ్య సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో లోకల్ అకాడమీలో చేరాడు. తన పేస్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ను ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌ చేసుకునే ప్రయత్నం చేశాడు. కానీ, 2015లో  ఆకాశ్ తండ్రి పక్షవాతానికి గురై మరణించాడు. రెండు నెలల్లోనే అన్న కూడా మృతి చెందాడు. దాంతో ఆకాశ్ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది.

కుటుంబ భారం తనపై పడటంతో మూడేండ్ల పాటు ఆటకు దూరమయ్యాడు. కరోనా టైమ్‌‌‌‌‌‌‌‌లో తల్లికి ఆరోగ్య సమస్యలు రావడంతో ఆమె వైద్య  ఖర్చులు సంపాదించేందుకు ఆకాశ్‌‌‌‌‌‌‌‌కు క్రికెట్టే దిక్కయింది. ఇందుకోసం బెంగాల్‌‌‌‌‌‌‌‌ వెళ్లడం అతని కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మార్చింది. బెంగాల్‌‌‌‌‌‌‌‌లో క్లబ్ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడుతూ వచ్చిన డబ్బుతో తల్లికి ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేయించాడు. ఈ క్రమంలో విజన్ 2020 ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో  బెంగాల్ పేసర్ రణదేవ్‌‌‌‌‌‌‌‌ బోస్‌‌‌‌‌‌‌‌తో కలిసి చేసిన ఆకాశ్‌‌‌‌‌‌‌‌ను ఎట్టకేలకు అదృష్టం తలుపుతట్టింది. ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌ ద్వారా అతను బెంగాల్ అండర్– 23 జట్టుకు ఎంపికయ్యాడు.

అంతకుముందు వరకు టెన్నిస్ బాల్‌‌‌‌‌‌‌‌తో మాత్రమే ఆడిన ఆకాశ్‌కు ఏజ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడిన అనుభవం లేదు. అయినా బెంగాల్‌‌‌‌‌‌‌‌ అండర్‌‌‌‌‌‌‌‌–‌‌‌‌‌‌‌‌23 జట్టు తరఫున సత్తా చాటాడు. ఆపై రంజీ ట్రోఫీ అరంగేట్రం,  ఆ తర్వాత ఆర్సీబీ నుంచి చాన్స్‌‌‌‌‌‌‌‌ రావడంతో అతని కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారిపోయింది. ఇప్పుడు తల్లి ముందు ఇండియా తరఫున టెస్టు అరంగేట్రం చేశాడు.  అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌16, అండర్19 క్రికెట్ ఆడకపోయినా అద్భుత ప్రతిభతో 27 ఏండ్లకు టీమిండియాలోకి వచ్చేందుకు ప్రతీ అడ్డంకినీ  అధిగమించాడు.. క్రికెట్ ఆడొద్దన్న తండ్రి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని తనకు చెప్పేవాడని ఆకాశ్ గుర్తు చేసుకున్నాడు.  తొలి రోజు మూడు వికెట్ల పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ను తండ్రికి అంకితం ఇచ్చాడు.  

ఒకే ప్రత్యర్థిపై (ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌) వెయ్యికి పైగా రన్స్‌‌‌‌‌‌‌‌ చేసి వంద వికెట్లు తీసిన తొలి ఇండియన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌

సంక్షిప్త స్కోర్లు

ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 90 ఓవర్లలో 302/7 (జో రూట్‌‌‌‌‌‌‌‌ 106*, బెన్‌‌‌‌‌‌‌‌ ఫోక్స్‌‌‌‌‌‌‌‌ 47, క్రాలీ 42, ఆకాశ్‌‌‌‌‌‌‌‌ దీప్‌‌‌‌‌‌‌‌ 3/70).