
పాతబస్తీకి మెట్రో తీసుకొచ్చే విషయంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ.హైదరాబాద్ అంతా మెట్రో తిరుగుతోంది కానీ.. పాత బస్తీకి మాత్రం రాలేద న్నారు. గత ప్రభుత్వం హైటెక్ సిటీ, గచ్చిబౌలీని అభివృద్ధి చేసింది గానీ పాతబస్తీని మాత్రం నిర్లక్ష్యం చేసిందన్నారు. ఎన్నిసార్లు కోరినా పాతబస్తీ అభివృద్ధికి నిధులు ఇవ్వలేదన్నారు.
రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డు భూములు అక్రమణలకు గురవుతున్నాయన్నారు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ..గత ప్రభుత్వం తో దోస్తీ చేశాం.. ప్రస్తుత ప్రభుత్వం కూడా దోస్తీ చేస్తాం.. వక్ఫ్ బోర్డు భూములను కాపాడాలని అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు.
ALSO READ | మేం సక్కగా పాలించలే.. అందుకే ప్రతిపక్షంల కూసోబెట్టిన్రు : హరీశ్ రావు
గత ప్రభుత్వం పాతబస్తీ అభివృద్దిని ఏమాత్రం చేలేదు.. నిధులు కేటాయించలేదు .. మా ప్రభుత్వం పాతబస్తీ అభివృద్దికి నిధులు కేటాయించి అన్ని విధాలా అభివృద్ది చేస్తామన్నారు. పాతబస్తీలో మెట్రో ఏర్పాటుకు గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినా.. మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీలో మెట్రో తీసుకొస్తామని హామీ ఇచ్చారు.