దమ్మున్న లీడర్ వస్తే.. నేను రెస్ట్ తీసుకుంటా : అక్బరుద్దీన్ ఒవైసీ

దమ్మున్న లీడర్ వస్తే.. నేను రెస్ట్ తీసుకుంటా : అక్బరుద్దీన్ ఒవైసీ
  • మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ
  • ప్రజాభిమానంతో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని కామెంట్​

ఓల్డ్​సిటీ, వెలుగు: తన స్థానంలోకి ఎవరైనా బలమైన నాయకుడు, ధైర్యవంతుడు, దృఢ సంకల్పంతో పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకొని రెస్ట్ తీసుకుంటానని మజ్లిస్ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. 

ప్రజాభిమానంతో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, విద్యాభివృద్ధి కోసం ఒవైసీ విద్యాసంస్థలను ఏర్పాటు చేశానని తెలిపారు. ఇంతకంటే ఇంకేం కావాలని, బాగా అలసిపోయానని బలమైన నాయకుడు వస్తే పదవిని వదిలి ప్రశాంతంగా జీవించాలని అనుకుంటున్నానని చెప్పారు. తాను నిర్మించిన విద్యాలయాలను చూస్తూ శేషజీవితం గడుపుతానన్నారు. 

హైదరాబాద్ ఓల్డ్​సిటీలో హఫీజ్​బాబానగర్​లో ఒవైసీ విద్యాసంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన డాక్టర్ నూరుద్దీన్​ఒవైసీ క్యాంపస్, లైబ్రరీ ప్రారంభోత్సవంలో ఆయన తన మనసులో మాట చెప్పారు. మజ్లిస్ ఫలానా రాజకీయ పార్టీకి ఏజెంట్, బీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌టీమ్ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారని, వారికి బిహార్​ఎన్నికల్లో ఎంఐఎంకు వచ్చిన ఫలితాలే చెంప పెట్టులాంటిదన్నారు. బిహార్​ఎన్నికల్లో మజ్లిస్​ఐదు అసెంబ్లీ సీట్లు సాధించడంతో పాటు జూబ్లీహిల్స్​లో తాము మద్దతిచ్చిన నవీన్​యాదవ్ గెలిచారని చెప్పారు.