సౌదీ బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సూచించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
సౌదీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 42 మంది మృతి చెందారు. మృతుల్లో హైదరాబాద్ మల్లేపల్లిలోని ఉమ్రా ట్రావెల్స్‌కు సంబంధించిన 16 మంది యాత్రికులు ఉన్నారు. సీఎం ఆదేశాలతో సహాయక చర్యల కోసం తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.కంట్రోల్ రూమ్ నంబర్లు: 79979 59754, 99129 19545
సౌదీలో సోమవారం (నవంబర్ 17) తెల్లవారు జామున డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 42 మంది మృతి చెందారు. భారతీయ యాత్రికులు మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న క్రమంలో బదర్-మదీనా మధ్య ముఫరహత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. ఎక్కువ మంది హైదరాబాద్ వాసులుగా గుర్తించారు.
