ఆనాటి పత్రికలు అగ్నికీలలు ..మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

ఆనాటి పత్రికలు అగ్నికీలలు ..మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • ఇప్పుడు బూతులు మాట్లాడితే  అట్లాగే పబ్లిష్​ చేస్తున్నరని కామెంట్​
  •     అప్పుడు -ఇప్పుడు, అనుభవాలు- జ్ఞాపకాలు పుస్తకాల ఆవిష్కరణ 

బషీర్​బాగ్, వెలుగు: ఆనాటి పత్రికలు కాగితపు ముక్కలు కాదని, అగ్నికీలలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర ఉద్యమంలో అప్పటి పత్రికలు బ్రిటిష్ దురాగతాలు ప్రశ్నించే ఆయుధాలుగా పని చేశాయన్నారు. అప్పటి పత్రిక సంపాదకులు జైళ్లకు వెళ్లేందుకు కూడా వెనకాడలేదని, వారిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువ పాత్రికేయులు దేశ నిర్మాణంలో మరోసారి కీలక పాత్ర పోషించాలని కోరారు. బషీర్ బాగ్​ ప్రెస్​క్లబ్​లో ఆదివారం జరిగిన సీనియర్ పాత్రికేయులు కృష్ణ రాసిన పుస్తకాల ఆవిష్కరణ సభకు ఆయన ముఖ్య​అతిథిగా హాజరయ్యారు. 

‘అప్పుడు – ఇప్పుడు, అనుభవాలు – జ్ఞాపకాలు’ పుస్తకాలను ఆవిష్కరించారు. నేటి రాజకీయాలు దారుణంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న ఆడవారి గురించి మాట్లాడటం దారుణమన్నారు. నేటి రాజకీయ నాయకులు బూతులు మాట్లాడితే, వాటిని అలాగే ప్రచురిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

 మొదట్లో సోషల్ మీడియా మంచిగా పని చేసిందని , ఇప్పుడు యాంటీ సోషల్ మీడి యాగా మారిందన్నారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరును వెంకయ్య కొనియాడారు. ఆక్రమణల , కబ్జాలను తొలగిస్తుంటే హైడ్రాపై కొంత మంది విమర్శలు చేయడం సరికాదన్నారు.