ప్రజాసమస్యలు మాట్లాడితే దేశ ద్రోహి అంటారా?

ప్రజాసమస్యలు మాట్లాడితే దేశ ద్రోహి అంటారా?

దేశంలో ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయన్నారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ.  ప్రజా సమస్యలు మాట్లాడితే దేశ ద్రోహి అంటున్నారన్నారు. దేశంలో కొన్ని వర్గాలు భయంతో ఉన్నాయన్న ఓవైసీ.. పేదరికంపై ఎవరూ మాట్లాడటం లేదన్నారు. నిరుద్యోగ యువతను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. పార్లమెంట్ లో సీఏఏను టీఆర్ఎస్ వ్యతిరేకించిందన్నారు. రాష్ట్ర సమస్యలే టార్గెట్ గా సర్కార్ తీరును ప్రశ్నించారు  అక్బరుద్దీన్ ఓవైసీ. గతంలో ఇచ్చిన హామీలను అసెంబ్లీ వేదికగా గుర్తు చేశారు. కృష్ణా నీళ్లు హైదరాబాద్ కు రావడం లేదన్నారు. ఆలేరు ఎన్ కౌంటర్ పై కమిటీ రిపోర్ట్ ఆలస్యంపై ప్రశ్నించారు. GHMC పరిధిలో రోడ్ల విస్తరణ ఊసే లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వేగంగా నిర్మించాలన్న ఓవైసీ… ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరిందన్నారు.

see more news

సీఏఏపై అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే..

వకీల్ సాబ్ .. మగువా మగువా సాంగ్ ప్రోమో

బ్రదర్ తో హీరోయిన్ బికినీ ఫోజులు..నెటిజన్లు ఫైర్