V6 News

Akhanda 2 Effect: ‘అఖండ 2’ ఎఫెక్ట్‌.. మరో మూవీ రిలీజ్ వాయిదా.. ఇప్పటికీ ఎన్ని సినిమాలంటే?

Akhanda 2 Effect: ‘అఖండ 2’ ఎఫెక్ట్‌.. మరో మూవీ రిలీజ్ వాయిదా.. ఇప్పటికీ ఎన్ని సినిమాలంటే?

రామ్ కిరణ్, మేఘ ఆకాష్ జంటగా  బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘సఃకుటుంబానాం’ (Saha kutumbaanam). ఉదయ్ శర్మ  దర్శకత్వంలో మహదేవ్ గౌడ్, నాగరత్న నిర్మించారు. డిసెంబర్ 12న విడుదలవ్వాల్సిన ఈ సినిమాను వారం రోజులు వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్‌‌‌‌ను ప్రకటించారు.

డిసెంబర్ 12న  బాలకృష్ణ ‘అఖండ 2’ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుండటంతో బాలయ్యపై ఉన్న గౌరవంతో తమ చిత్రాన్ని డిసెంబర్ 19కి వాయిదా వేస్తున్నట్టు తెలియజేశారు. ‘కొన్ని నిర్ణయాలు వ్యాపారం కోసం కాదు, ఎమోషన్స్ కోసం. అదేవిధంగా ఈ నిర్ణయం కూడా ‘జై బాలయ్య’ అనే తెలుగువారి నినాదం కోసం’ అని టీమ్ చెప్పింది.

ఇక ఈ చిత్రంలో  బ్రహ్మానందం,  రాజేంద్రప్రసాద్, శుభలేఖ సుధాకర్, సత్య, రాజశ్రీ నాయర్, రచ్చ రవి, గిరిధర్, తాగుబోతు రమేష్, భద్రం ఇతర  పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు.

‘అఖండ 2’ వల్ల వాయిదా పడ్డ సినిమాలివే: 

హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఈషా’ డిసెంబరు 12 నుంచి డిసెంబరు 25కు వాయిదా పడింది. ఈ నెల 12న రావాల్సిన 'మోగ్లీ' 13కు, 'సఃకుటుంబానాం' 19కు, 'సైక్‌ సిద్ధార్థ్‌' 2026 జనవరి 1కి వాయిదా పడ్డాయి. అలాగే, ‘ఘంటసాల’, ‘నా తెలుగోడు’, ‘మిస్టీరియస్‌’, ‘ఇట్స్‌ ఓకే గురు’ లాంటి సినిమాలు కూడా వాయిదా వేసుకున్నాయి. కానీ, కొత్త డేట్స్ కూడా ప్రకటించాల్సి ఉంది.