
‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంయుక్త మీనన్.. బింబిసార, విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్స్‌తో గోల్డెన్ బ్యూటీ అనిపించుకుంది. దీంతో వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ అయింది. వాటిలో బాలకృష్ణ సినిమా ‘అఖండ 2’ కూడా ఒకటి. గురువారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అఖండ 2’ మేకర్స్ స్పెషల్ పోస్టర్‌తో ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఇక తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ చేతినిండా సినిమాలతో బిజీగా ఉందామె.
తెలుగులో ‘అఖండ 2’, నిఖిల్‌కు జంటగా ‘స్వయంభు’, శర్వానంద్‌తో ‘నారీ నారీ నడుమ మురారి’తో పాటు విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తోంది. అలాగే హిందీలో కాజోల్‌తో కలిసి ‘మహారాగ్ని: క్వీన్ ఆఫ్ క్వీన్స్’, తమిళంలో రాఘవ లారెన్స్‌కు జంటగా ‘బెంజ్’ చిత్రాల్లో నటిస్తోంది. మొత్తానికి ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది.