ఓట్ల లెక్కింపుపై ఈసీకి సమాజ్వాదీ పార్టీ లేఖ

ఓట్ల లెక్కింపుపై ఈసీకి సమాజ్వాదీ పార్టీ లేఖ

వారణాసి నియోజకవర్గంలో ఈవీఎంలను దొంగిలించారని ఆరోపించిన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ తాజాగా ఎలక్షన్ కమిషన్ ముందు మరో డిమాండ్ పెట్టారు. ఓట్ల లెక్కింపును ప్రత్యక్ష ప్రసారం చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసి ఆ లింకులను ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ పార్టీలకు పంపాలని ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశారు.ప్రస్తుతం 50శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నందున కౌంటింగ్ కేంద్రాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేయాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. ఈ లేఖను సమాజ్ వాదీ పార్టీ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే ఈవీఎంల విషయంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోందని, ఎవరికీ తెలియకుండా వాటిని తరలిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా వారణాసి జిల్లా కలెక్టర్ ఈవీఎంలను తరలించరాన్న ఆయన.. ఇది కచ్చితంగా దొంగతనం కిందకే వస్తుందని అన్నారు. ఈ అంశంపై ఎన్నికల సంఘం దృష్టి సారించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అఖిలేష్ కోరారు.

మరిన్ని వార్తల కోసం..

రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు