దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మంగళవారం నష్టాల నుంచి తేరుకున్న మార్కెట్ ఇవాళ దూసుకుపోయింది. అన్ని సానుకూల సంకేతాలే ఉండటంతో బుల్ పరుగులు పెట్టింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు బీజేపీ వైపు జనం మొగ్గుచూపారన్న ఎగ్జిట్ పోల్ అంచనాలు ట్రేడింగ్కు కలిసొచ్చాయి. నాటో సభ్యత్వానికి ఒత్తిడి చేయబోమన్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ ప్రకటన, ఐరోపా దేశాలు చమురు దిగుమతులపై ఆంక్షలు విధించకపోవడం, విమాన సర్వీసుల పునరుద్దరణకు సంబంధించి కేంద్రం చేసిన ప్రకటన మార్కెట్ సెంటిమెంటును ప్రభావితం చేశాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపారు.

ఉదయం 53,793.99 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైన మార్కెట్లో.. 53,367.52 పాయింట్లు ఇవాళ్టి కనిష్ఠ స్థాయి. కొనుగోళ్లు వెల్లువెత్తడంతో ఒక దశలో 54,893పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదుచేసిన సెన్సెక్స్.. మార్కెట్ ముగిసే సమయానికి 1223.24 పాయింట్ల ప్రాఫిట్తో 54,647.33 వద్ద క్లోజయింది. ఏషియన్ పెయింట్స్, రిలయెన్స్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు 5శాతానికిపైగా లాభపడ్డాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, మారుతి, హెచ్డీఎఫ్సీ, టైటాన్, ఎస్బీఐ వాటాలు సైతం లాభాలార్జించాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 331.90 పాయింట్ల ప్రాఫిట్తో 16,345.35 పాయింట్ల వద్ద ముగిసింది.

For more news..

రేపు ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు

అన్నదాతలు ఏకమైతే.. ఢిల్లీ పాలకులు పారిపోతారు