కాంగ్రెస్ హామీతో ఆశ్చర్యపోయా: అఖిలేశ్ యాదవ్

కాంగ్రెస్ హామీతో ఆశ్చర్యపోయా: అఖిలేశ్ యాదవ్
  • కాంగ్రెస్ హామీతో ఆశ్చర్యపోయా
  • గత్యంతరం లేకనే కుల గణన: అఖిలేశ్ యాదవ్

లక్నో: కాంగ్రెస్‌ పార్టీ వైఖరి ఆశ్చర్యానికి గురి చేసిందని, గత్యంతరం లేకనే ఆ పార్టీ దేశ వ్యాప్తంగా కులగణన హామీ ఇచ్చిందని సమాజ్​వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు. గతంలో కర్నాటకలో అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కుల గణన చేపట్టిందని గుర్తు చేశారు. దానికి సంబంధించిన డేటా ఇప్పటి దాకా రిలీజ్ చేయలేదని మండిపడ్డారు.

వెనుకబడిన వర్గాల ఓట్లు లేకుండా ఎన్నికల్లో గెలవలేమన్నది కాంగ్రెస్ పార్టీకి అర్థమైందని ఎద్దేవా చేశారు. బ్యాక్​వర్డ్ క్యాస్ట్ ఓటర్లు కాంగ్రెస్ వెంట లేరని తెలిసే.. దేశవ్యాప్తంగా కుల గణనకు ఆ పార్టీ హామీ ఇచ్చిందని విమర్శించారు. తనను వఖిలేశ్ అంటూ కమల్​నాథ్ కామెంట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక్కడ అఖిలేశ్ మాత్రమే ఉన్నాడని, వఖిలేశ్ ఎవరూ లేరన్నారు. కమల్​నాథ్ కామెంట్లపై సమాధానం చెప్పొచ్చని, కానీ.. ఆయనలా తాను విమర్శలు చేయలేనన్నారు. ఆయన పేరులో ‘కమల్’ ఉందని వేరేలా పిలవలేం కదా.. అని ఎద్దేవా చేశారు.