40 ఏళ్ల తర్వాత విడుదల కాబోతున్న అక్కినేని మూవీ

40 ఏళ్ల తర్వాత విడుదల కాబోతున్న అక్కినేని మూవీ

ఏ సినిమా అయినా రోజులు, నెలలు మరీ కాదంటే ఒకట్రెండు సంవత్సరాలు విడుదల కాకుండా ఉండడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఒక సినిమా రిలీజ్ కావడానికి ఏకంగా 40 ఏళ్లు పట్టింది. అదే 1982లో షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రతిబింబాలు సినిమా. ప్రముఖ నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వరావు, నటి జయసుధ, తులసి  కలిసి నటించిన ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల అప్పుడు విడుదల కాలేదు. అయితే మళ్లీ ఇప్పుడు... అంటే 40 సంవత్సరాల తర్వాత విడుదల కాబోతుంది. అది కూడా థియేటర్లలో. 

ఈ చిత్రం కొంత భాగం అప్పటి దర్శకుడు కె. ఎస్. ప్రకాష్ రావు, మరికొంత భాగం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీని జాగర్లమూడి రాధాకృష్ణ నిర్మించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...ఆనాడు తాము కొత్తగా ఫీలయి ఈ చిత్ర కథాంశాన్ని ఎన్నుకున్నామని, ఈనాటికీ అలాంటి కథ ఉన్న సినిమాలేమీ రాలేదని చెప్పారు. యంగ్ లుక్ లో అక్కినేని నటన అందర్నీ ఆకర్షిస్తుందన్న రాధాకృష్ణ.. జయసుధ కూడా పోటీపడి నటించారని తెలిపారు.

అప్పట్లో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నా విడుదలకు నోచుకోలేదు. మరి ఇప్పుడు విడుదలైతే ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మూవీలో గుమ్మడి, కాంతారావు, సుత్తివేలు, సాక్షి రంగారావు, జయమాలిని, అనురాధ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రవర్తి, కెమెరా: సెల్వరాజ్, హరనాథ్‌.