
మన్మధుడు, కింగ్ వంటి పేర్లకు చిరునామా అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). వెరైటీకి కేరాఫ్. స్టైల్‌కి ఐకాన్. గ్లామర్‌తో చంపేసిన కిల్లర్ అతను. మొత్తంగా ఇండస్ట్రీలో ఆయనో సెన్సేషన్. ఎందరికో ఇన్‌స్పిరేషన్. అందరికీ వయసు పెరుగుతూ పోతుంది. ఆయనకి మాత్రం తరుగుతూ వస్తుంది. ఇప్పటికీ యంగ్ హీరోలకు ఆయనతో పోటీనే. బ్యూటిఫుల్ హీరోయిన్లకు ఆయన ఫేవరేట్ పెయిరే. నటుడిగా.. నిర్మాతగా.. హోస్ట్ గా.. బిజినెస్‌మేన్‌గా.. ప్రతి పాత్రనూ సమర్థవంతంగా పోషించడం ఆయనకే చెల్లింది. అందుకే సౌత్‌తో పాటు, నార్త్ ప్రేక్షకగణమంతా ఆయనకు ఫిదా అయ్యింది. పాత్ర ఏదైనా! ‘వాసివాడి తస్సాదియ్యా! అనిపించే కింగ్ పుట్టినరోజు ఇవాళ (ఆగస్ట్ 29). చెన్నైలో 1959 ఆగస్టు 29న జన్మించారు నాగార్జున. నేడు నాగ్ తన అందమైన 66వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు.
Celebrating the eternal King of Hearts & Screens ✨
— Annapurna Studios (@AnnapurnaStdios) August 29, 2025
Wishing our beloved @iamnagarjuna garu a very Happy Birthday! 👑#HBDKingNagarjuna pic.twitter.com/2IdrPQTis9
ఈ సందర్భంగా అక్కినేని నట వారసుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నాగ్ హోమ్ బ్యానర్ స్టూడియోస్ స్పెషల్ మ్యాష్‌అప్ వీడియోను షేర్ చేసింది. ఇప్పటి వరకూ ఆయన చేసిన సినిమాల్లోని కొన్ని పాత్రల ఫేమస్ డైలాగులతో చేసిన ఈ వీడియో అక్కినేని ఫ్యాన్స్ను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ‘ఈ ఫీల్డ్‌లో కొత్తగా ట్రై చేయాలంటే నేనే’ అంటూ నాగార్జున చెప్పిన డైలాగ్ వీపరీతంగా ఆకట్టుకుంటోంది. నాగార్జున తన ఫస్ట్ మూవీ విక్రమ్ (1986 మే 23లో) విడుదలైంది. ఇపుడు 66 ఏళ్ల వయసులో కూడా డిఫెరెంట్ క్యారెక్టర్స్ చేస్తూ, త్వరలో 100వ సినిమాను షురూ చేయనున్నాడు.
నాగార్జున డిఫెరెంట్ క్యారెక్టర్స్:
గీతాంజలి, అన్నమయ్య, మన్మధుడు, శ్రీ రామదాసు, ఊపిరి ఇలా ప్రతి సినిమా ఓ సంచలనమే. ముఖ్యంగా అన్నమయ్య సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా ఈ సినిమాకు జాతీయ స్థాయి ప్రత్యేక జ్యూరీ పురస్కారం కూడా లభించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలకు గానూ ప్రత్యేక పురస్కారాలు, ప్రశంసలు అందుకున్నారు.
నటుడిగా నంది పురస్కారాలు:
1990 - శివ సినిమాలో ఉత్తమ నటుడు.
1996 - నిన్నే పెళ్ళాడుతా ఉత్తమ చిత్ర పురస్కారం
1997 - అన్నమయ్య సినిమాలో ఉత్తమ నటుడు.
1999 - ప్రేమకథ నంది మూడో అత్యుత్తమ చిత్రం
2002 - సంతోషం నంది ఉత్తమ నటుడు
2002 - మన్మధుడు నంది ఉత్తమ చిత్రం
2006 - శ్రీరామదాసులో నంది ఉత్తమ నటుడు
2011 - రాజన్న నంది ద్వితీయ ఉత్తమ చిత్రం
ఇలా నాగ్ తన కెరీర్లో ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇటీవలే కుబేర, కూలీ సినిమాలతో తనదైన పాత్రల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం తన 100వ సినిమాను సెలెక్ట్ చేసే పెనిలో పడ్డాడు నాగార్జున.
తమిళ దర్శకుడు రా.కార్తీక్ తనకు ఓ స్టోరీ వినిపించాడని, గత ఆరేడు నెలలుగా దీనిపై వర్క్ జరుగుతోందని ఇటీవలే నాగ్ కూడా చెప్పారు. ఎంతో గ్రాండ్ లెవెల్‌లో ఈ సినిమా ఉండబోతోందని, తన నెక్స్ట్ సినిమా అదేనని కూడా ఆయన చెప్పారు. గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ‘కింగ్ 100 నాటౌట్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇవాళ అప్డేట్ వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే నాగ్ బర్త్ డే కానుకగా ఇండస్ట్రీ సెన్సేషనల్ హిట్ సినిమా ‘శివ’ 4Kలో రీ రిలీజ్ కానుంది. ఒక కల్ట్ క్లాసిక్‌గా మార్చిన ప్రేక్షకులకు, అలాగే కొత్త తరానికి కొత్త అనుభూతిని పంచడానికి Dolby Atmos సౌండ్‌తో, 4K విజువల్స్‌తో ఇవాళ తెరపైకి రానుంది.