సింగరేణి ఓసీపీ నుంచిరామప్పను రక్షించాలి : అక్కిరెడ్డి వెంకట రాంమోహన్  రావు

సింగరేణి ఓసీపీ నుంచిరామప్పను రక్షించాలి : అక్కిరెడ్డి వెంకట రాంమోహన్  రావు
  • రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్  విజ్ఞప్తి

వెంకటాపూర్ ( రామప్ప), వెలుగు : యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ ను సింగరేణి ఓపెన్ కాస్ట్  బారి నుంచి రక్షించాలని, యునెస్కో నిబంధనల మేరకు అభివృద్ధి చేయాలని కోరుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి రామప్ప పరిరక్షణ కమిటీ కన్వీనర్  అక్కిరెడ్డి వెంకట రాంమోహన్  రావు మంగళవారం ఢిల్లీలో వినతిపత్రం సమర్పించారు .ఈ సందర్భంగా రాంమోహన్ రావు మాట్లాడుతూ రామప్ప గుడికి పది కిలోమీటర్ల దూరంలో సింగరేణి కంపెనీ ఓపెన్  కాస్ట్  మైనింగ్ చేయడానికి ఇరవై సంవత్సరాలు గా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నదని చెప్పారు.

ఓపెన్  కాస్టు తవ్వకాలు చేపడితే ఆలయం నేలకూలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఇచ్చిన సంస్థల అనుమతులన్నీ రద్దు చేసి రామప్ప గుడిని కాపాడాలని విజ్ఞప్తి చేశామన్నారు. అందుకోసం రామప్ప కట్టడాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిని బఫర్ జోన్ గా ప్రకటించాలని, యునెస్కో నిబంధనల మేరకు సౌకర్యాలు ఉండేలా చూడాలని కోరారు. అలాగే స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, పాలంపేట గ్రామాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని, జీవవైవిధ్య పరిరక్షణకు తీసుకోవాలని మంత్రిని కోరిమని ఆయన వెల్లడించారు.