
మంచు ఫ్యామిలీ వివాదం అందరికీ తెలిసిన విషయమే. కొన్నేళ్లుగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. తిరుపతి జిల్లాలో పెదరాయుడి విద్యాసంస్థల కేంద్రం చుట్టూనే ఈ గొడవలు జరుగుతున్నాయన్న ప్రచారం ఉంది.
ఇటీవల హైదరాబాద్లో జరిగిన వివాదం రచ్చయింది. తండ్రీ కొడుకులన్నాక కలిసుండాలనే కోరుకుంటారు. ఈ విషయంలో మంచు మనోజ్ కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు.
లేటెస్ట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మనోజ్ తన మనసలోని కోరికను బయటపెట్టాడు. తన తండ్రి పెదరాయుడి వద్దకు వెళ్లి ఆయన కాళ్లు పట్టుకోవాలని, తన కూతురును ఆయన ఒడిలో పెట్టాలని ఉన్నట్లు చెప్పాడు. కానీ అలా చేస్తే చేయని తప్పును అంగీకరిస్తున్నట్లు అవుతుందని చేయడం లేదన్న ఆయన ఇది తమ నాన్న నేర్చిన నీతిగా చెప్పుకొచ్చాడు.
ALSO READ | Bhairavam: మే 25న భైరవం ప్రీ-రిలీజ్ ఈవెంట్.. డైరెక్టర్ విజయ్ కనకమేడల స్పీచ్పై ఉత్కంఠ!
సంబంధం లేని విషయంలోకి నా భార్యను లాగారు. అప్పుడు నా హృదయం ముక్కలైంది. తనకు అన్నీ నేనే. నేను తప్పు చేయలేదు. ఇకపోతే తామంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించాడు. గొడవ తాను పెట్టుకోలేదని, సమస్యలు సృష్టించిన వారు. తప్పుని తెలుసుకుంటారనే నమ్మకం ఉందన్నారు.
శివయ్యా కామెంట్స్పై మనోజ్ రియాక్ట్:
ఇటీవల భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మనోజ్ తన అన్న విష్ణుపై ఇన్ డైరెక్ట్గా చేసిన కామెంట్స్ చేయగా ట్రెండ్ అయ్యాయి. 'లాంచ్, రీ లాంచ్ అని చాలా ప్లాన్ చేశాను..మనం ఒకటి అనుకుంటే, దేవుడు ఇంకోటి తలుస్తాడు. ‘శివుడిని శివయ్యా అని పిలిస్తే రాడు. శివుడిని మనసారా తలుచుకుంటే.. మా డైరెక్టర్ రూపంలోనో.. ప్రొడ్యూజర్ రూపంలోనో.. మీ అందరి రూపంలోనో వచ్చేదే శివుడు’ అని మనోజ్ కన్నప్ప మూవీని ఉద్దేశిస్తూ..సెటైరికల్‍గా మాట్లాడారు.
ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవ్వడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో శివయ్య కామెంట్స్‌పై మనోజ్ స్పందించాడు. తాను చేసిన శివయ్యా కామెంట్స్ పై క్షమాపణలు చెప్పుకొచ్చాడు. ‘సినిమా అంటే ఒక్కడికాదు.. అందులో ఎంతో మంది పని చేస్తారు.. ఒక్కరి కోసం సినిమాను విమర్శించడం తప్పే. ఒక సినిమా వాడిగా నేను అలా అనకూడదు. ఎప్పుడైనా ఏదైనా అని ఉంటే.. కన్నప్ప టీంకి క్షమాపణలు కోరుతున్నాను. అవి ఎమోషనల్‌గా చేసిన కామెంట్సే తప్ప..దానివెనుక ఎటువంటి ఉద్దేశం నాకు లేదు. కన్నప్ప సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని మనోజ్ అన్నారు. మరి మనోజ్ క్షమాణాలతో విష్ణు ఎలా స్పందిస్తాడో తెలియాల్సి ఉంది.
ఇక మనోజ్ సినిమాల విషయానికొస్తే భైరవం మూవీతో ఆయన ప్రేక్షకులను పలకరించను న్నాడు. ఈ సినిమా మే30న విడుదల కానుంది. అలాగే తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నాడు. 'అత్తరు సాయిబు' పేరుతో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ వినిపిస్తుంది. గతంలో '90 ఎమ్ఎల్' తీసిన దర్శకుడు శేఖర్ రెడ్డి.. మనోజ్తో మూవీ చేయబోతున్నాడని తెలుస్తోంది.