Bhairavam: మే 25న భైరవం ప్రీ-రిలీజ్ ఈవెంట్.. డైరెక్టర్ విజయ్ కనకమేడల స్పీచ్పై ఉత్కంఠ!

Bhairavam: మే 25న భైరవం ప్రీ-రిలీజ్ ఈవెంట్.. డైరెక్టర్ విజయ్ కనకమేడల స్పీచ్పై ఉత్కంఠ!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌‌‌‌లో నటించిన  మూవీ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మించారు. మే 30న సినిమా విడుదల కానుంది.

ఇప్పటికే పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పోస్టర్లు, యాక్షన్‌‌‌‌తో నిండిన టీజర్, ట్రైలర్తో  అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో మేకర్స్ గ్రాండ్గా ‘భైరవం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. పోస్టర్ రిలీజ్ చేసి అధికారికంగా వివరాలు వెల్లడించారు. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మే 25న సాయంత్రం 5 హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

ALSO READ | OTT Blockbuster: థియేటర్లలోకి తెలుగు మూవీ.. ఫ్రీ టికెట్స్.. వెంటనే బుక్ చేసుకోండి!

"భైరవం మొత్తం తారాగణం ఒక వేడుక చేయడం కోసం సిద్ధంగా ఉంది. భైరవం గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ మే 25న సాయంత్రం 5 గంటల నుండి హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో. మే 30న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో" అంటూ X లో పోస్ట్ చేసింది. 

ఇకపోతే ఈ మూవీ టీజర్, ట్రైలర్ విజువల్స్ ఇచ్చిన ఇంపాక్ట్ కంటే, విజయ్ కనకమేడల వల్ల మరింత టాక్ తెచ్చుకుంది. 2011లో చిరంజీవి, రామ్‌ చరణ్‌లపై ఫేస్‌బుక్‌లో పెట్టిన ఒక పోస్ట్‌ వల్ల మెగా ఫ్యాన్స్ లో దుమారం రేపాడు. హిందీలో అమితాబ్‌, అభిషేక్‌ కలిసి నటించిన ‘పా’మూవీ పోస్టర్‌ని మార్పింగ్‌ చేసి చిరంజీవి, రామ్‌ చరణ్‌ ముఖాలను వాటిపై అతికించడంతో.. 'బాయ్‌కాట్ భైరవం' అనేలా మార్మోగిపోయాడు. 

ఇక ఎడిట్ చేసిన ఆ పోస్టర్‌కి ‘ఛా’అనే టైటిల్‌ పెట్టి.. ‘సామాజిక న్యాయం సమర్పించు..‘ఛా’అని వ్యంగ్యంగా క్యాప్షన్ ఇవ్వడంతో మెగా ఫ్యామిలీ వివాదంలో చిక్కుకుపోయాడు. అయితే, మెగా ఫ్యాన్స్కు క్షమాపణలు చెబుతూ నోట్ రిలీజ్ చేసినప్పటికీ.. ఎక్కడ తగ్గట్లేదు. మరి భైరవం రిలీజ్ వరకు ఎలాంటి పరిణామాలు ఎదుర్కోనున్నాడో అనేది ఆసక్తి నెలకొంది. 

అంతేకాకుండా ట్రైలర్ ఈవెంట్లో 'ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. సరిగ్గాఏడాదిక్రితం మన రాష్ట్రంలో ధర్మాన్ని కాపాడడం కోసం ఒకరు వచ్చారు' అని విజయ్ పొలిటికల్‌ కామెంట్స్‌ చేశాడు. దీంతో YSRCP అభిమానులు కూడా విజయ్‌ కామెంట్స్‌పై ఫైర్ అవుతూ బాయ్‌కాట్ భైరవం అంటున్నారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్దగా చేస్తుండటంతో ఎలాంటి స్పీచ్ ఇవ్వనున్నాడో అనేది ఆసక్తిగా మారింది.