లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగద్గిరిగుట్ట ఎస్సై

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగద్గిరిగుట్ట ఎస్సై

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు ఓ ఎస్సై. పెళ్లిళ్లకు బ్యాండ్ వాయించే బ్యాండ్ ట్రూప్ నుంచిలంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికాడు.  వివరాల్లోకి వెళితే..

ఓ బ్యాండ్ ట్రూప్ నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు జగద్గిరిగుట్ట ఎస్సై శంకర్. బల్కంపేటకు చెందిన హరికమల్ బ్యాండ్ సిబ్బంది జగద్గగిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ శుభకార్యానికి హాజరై బ్యాండ్ వాయించారు. అయితే శబ్ధకాలుష్యానికి పాల్పడుతున్నారంటూ ఎస్సై శంకర్ బ్యాండ్ కు సంబంధించిన వాహనాన్ని సీజ్ చేశాడు. జగద్గిరి గుట్టకు చెందిన మధ్యవర్తి నాగేందర్ ను మధ్యవర్తిగా పెట్టుకొని బ్యాండ్ ట్యూప్ నుంచి 15వేలు లంచం డిమాండ్ చేశాడు.  ఎస్సై వేధింపులు భరించలేక బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. 

ALSO READ | సెల్ఫోన్ దొంగను పట్టించిన రోడ్డు ప్రమాదం

శనివారం (మే24) ఉదయం బాధితుడు రూ. 15వేలు మధ్యవర్తి నాగేందర్ కు అందజేశాడు. నాగేందర్ ఆ మొత్తాన్ని ఎస్సై శంకర్కు అందజేస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన ఎస్సై శంకర్, అతనికి సహకరించిన నాగేందర్ పై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.