సెల్ఫోన్ దొంగను పట్టించిన రోడ్డు ప్రమాదం

సెల్ఫోన్ దొంగను పట్టించిన రోడ్డు ప్రమాదం

అతడో దొంగ. దొంగతనాలకు అలవాటుపడి సెల్ఫోన్లు చోరీలు చేస్తున్న అతడిని రోడ్డు ప్రమాదం పట్టించింది.  టైం బాగుంటే నార్మల్ గా నే ఫోన్లను అమ్ముకొని ఎంజాయ్ చేసేవాడు. అయితే టైం బాగోలేక యాక్సిడెంట్ కావడంతో సెల్ ఫోన్లు అన్ని కిందపడ్డాయి. ఒక్కసారిగా ఫోన్లు అన్ని మోగాయి. గాయపడిన వ్యక్తి దొంగ అని గుర్తించిన స్థానికులు పోలీసులకు అప్పగించారు. 

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ పరిధిలో శనివారం(మే24) రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఓ దొంగను పట్టించింది. చోరీ చేసిన సెల్ ఫోన్లతో పరారవుతున్న దొంగకు బండ్లగూడ పరిధిలోని హైదర్ షా కోటలో యాక్సిడెంట్ అయింది. నార్సింగి పరిధిలోని మాధవినగర్ హిమగిరినగర్, బండ్లగూడ ప్రాంతాల్లో ఆరు సెల్ ఫోన్లను చోరీ చేశాడు ఆ దొంగ. పారిపోతుండగా హైదర్ షా కోటలో ఈ ప్రమాదం జరిగింది. 

ALSO READ | రామగుండంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు..తప్పిన పెను ప్రమాదం

గుర్తు తెలియన వాహనం ఢీకొట్టడంతో దొంగకు కిందపడిపోయాడు. గాయపడిన దొంగకు స్థానికులు సాయం చేసే క్రమంలో స్థానికులు అతని జేబులో ఆరు సెల్ఫోన్లు గుర్తించారు. అవి ఒక్కసారిగా మోగడంతో వాటిని లిఫ్ట్ చేయగా అతడు ఆ సెల్ ఫోన్లను దొంగిలించినట్టు గుర్తించారు. విషయాన్ని నార్సింగి పోలీసులకు తెలిపారు. సెల్ ఫోన్లు ఎవరివి వారికి ఇచ్చి దొంగలను నార్సింగ్ పోలీసులు అరెస్ట్ చేశారు.