
పాలిటెక్నిక్, బీఎస్సీ మ్యాథ్స్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో చేరేందుకు మే 12 న నిర్వహించిన ఈ సెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆదివారం (మే 25) TG ECET-2025 ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణా రెడ్డి రిజల్ట్స్ విడుదల చేశారు. ఓయూ వీసీ కుమార్ తో పాటు ఉన్నత విద్యా మండలి, ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల సమక్షంలో ఫలితాలు విడుదల చేశారు. మొత్తం 96.22% మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఈ సెట్ ను మే 12 న నిర్వహించగా.. మొత్తం 18 వేల 928 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 96.22 శాతం ఉత్తీర్ణత సాధించడంపై చైర్మన్ బాలకృష్ణ తెలిపారు.
వివిధ విభాగాల్లో ఫస్ట్ ర్యాంకర్స్ వీరే:
- సంతోష్ కుమార్ - బీఎస్సీ మ్యాథ్స్
- లెంక తేజ సాయి - కెమికల్ ఇంజినీరింగ్
- నిఖిల్ కౌశిక్ - సివిల్ ఇంజినీరింగ్(గోల్కొండ)
- శ్రీకాంత్ - కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్
- కట్లే రేవతి - ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్
- కాసుల శ్రావణి - ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్
- రాపర్తి చందన - ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్
- పోతుగంటి కార్తీక్ - మెకానికల్ ఇంజినీరింగ్
- తోట సుబ్రహ్మణ్యం - మెటలర్జికల్ ఇంజినీరింగ్
- కుర్మా అక్షయ - మైనింగ్ ఇంజినీరింగ్
- ఐలి చందన - ఫార్మసీ లో మొదటి