
కేరళలో నిప్పుకోడి ( ఆస్ట్రిచ్ పక్షి) రోడ్డుపై హల్ చల్ చేసింది. ఎర్నాకుళం జిల్లా ఎడతలలో రద్దీగా ఉండే రోడ్డుపై పరిగెత్తింది. ట్రాఫిక్ రూల్స్ పాటించిన ఆ భారీ పక్షిని చూసి ప్రజలు షాక్అయ్యారు. అది అలా రోడ్డుపై వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 'feels_of_kochi' అనే ఖాతాలో .. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనే క్యాప్షన్ తో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఈ వీడియోను 7.4 మిలియన్ల మంది వీక్షించి ఫన్నీ కామెంట్లు పెట్టారు.
కేరళ దేవాలయాల్లో ఏనుగులు..రోడ్లపై నిప్పుకోడి అని కామెంట్ చేశారు. చాలామంది డ్రైవర్ల కంటే ఈ ఉష్ణపక్షికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన ఉందని మరొకరు రాసుకొచ్చారు. నిజంగా ఎవరో జుమాంజీని ఆడుతున్నారు... ఇంకొకరు వ్యాఖ్యానించారు.
కేరళ అభివృద్ది చెందలేదని కొందరంటుంటారు.. గతంలో రోడ్డుపై బాతులు.. కోళ్లు నడిచేవి.. ఇప్పుడు చూడండి ఉష్ణపక్షులు కూడా నడుస్తున్నాయి.. అంటే కేరళ ఎంత డెవలప్ అయిందో తెలుసుకోండి అని మరొకరు కామెంట్ చేశారు.