ఒకప్పుడు బాలకృష్ణ, నాగార్జునతో సినిమాలు.. ఇపుడు అక్షయ్, సైఫ్తో భారీ మల్టీస్టారర్.. ఆ డైరెక్టర్ ఎవరంటే?

ఒకప్పుడు బాలకృష్ణ, నాగార్జునతో సినిమాలు.. ఇపుడు అక్షయ్, సైఫ్తో భారీ మల్టీస్టారర్.. ఆ డైరెక్టర్ ఎవరంటే?

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్  ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న చిత్రం ‘హైవాన్’. సరికొత్త థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోన్న  ఈ చిత్రాన్ని  కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ  మూవీ రెగ్యులర్ షూటింగ్ శనివారం కొచ్చిలో ప్రారంభమైంది. ఊటీ, ముంబైలలో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది. అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు.

ఇందులో నటించడం ఎక్సయిటింగ్‌‌‌‌‌‌‌‌గా ఉందని అక్షయ్, సైఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ  చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ వ్యాల్యూస్‌‌‌‌‌‌‌‌తో నిర్మిస్తున్నామని నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ చెప్పారు. మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

దర్శకుడు, రచయిత ప్రియదర్శన్ తెలుగులో రెండు సినిమాలు తెరకెక్కించాడు. నాగార్జునతో నిర్ణయం, బాలకృష్ణతో గాండీవం సినిమాలు చేశాడు.