కొడంగల్‌‌‌‌ స్టూడెంట్లకు ‘అక్షయ పాత్ర’ మధ్యాహ్న భోజనం

కొడంగల్‌‌‌‌ స్టూడెంట్లకు ‘అక్షయ పాత్ర’ మధ్యాహ్న భోజనం
  •     గ్రీన్​ఫీల్డ్​ కిచెన్​కు 14న భూమిపూజ
  •     సీఎం రేవంత్​కు ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు అక్షయ పాత్ర ఫౌండేషన్ ముందుకు వచ్చింది. సోమవారం అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 14న కొడంగల్ లో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ కిచెన్ భూమి పూజకు రావాలని సీఎంను ఆహ్వానించారు. 

మధ్యాహ్న భోజనం తయారు చేసేందుకు కొడంగల్ సమీపంలోని ఎన్కేపల్లిలో రెండెకరాల విస్తీర్ణంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ గ్రీన్ ఫీల్డ్ కిచెన్ నిర్మించనుంది.గ్రీన్ ఫీల్డ్ కిచెన్ లో వండిన భోజనాన్ని నియోజకవర్గం లోని అన్ని  పాఠశాలలకు సరఫరా చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ బడుల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి ఒక్కో విద్యార్థికి రూ.7 ప్రభుత్వం చెల్లిస్తున్నది