అక్షయ తృతీయ 2023: ద్వాపర యుగం లేదా సత్యయుగం, త్రేతా యుగం అన్నీ ఎప్పుడు మొదలయ్యాయి లేదా ముగిశాయి అనే ప్రశ్న చాలా మంది చాలా సార్లు అడగడం, వినడం చూస్తూనే ఉంటాం. వాస్తవానికి, దీనికి ఎవరికీ ఖచ్చితమైన సమాధానం తెలియదు. కానీ ఆ కాలానికి సంబంధించి అనేక మత విశ్వాసాలు ప్రబలంగా నాటుకుపోయాయి. అక్షయ తృతీయ రోజున ఒక యుగం ముగిసి రెండో యుగాలు ప్రారంభమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అక్షయ తృతీయకు సంబంధించిన అనేక తెలియని వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. పౌరాణిక విశ్వాసాల ప్రకారం అక్షయ తృతీయ రోజున రెండు పవిత్ర యుగాలు ప్రారంభమవుతాయి. ఈ పవిత్రమైన రోజుతో ద్వాపర యుగం ముగిస్తుందని కొంత మంది చెప్తుంటారు.
2. బద్రీనాథ్ తలుపులు అక్షయ తృతీయ రోజున మాత్రమే తెరుచుకుంటాయి. ఈ రోజు నుంచి భక్తులు నారాయణుని దర్శించి పూజిస్తారు. చార్ ధామ్ ప్రయాణంలో బద్రీనాథ్ ఒక ముఖ్యమైన తీర్థయాత్ర అన్న విషయం అందరికీ తెలిసిందే.
3. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజు పొరపాటున కూడా అల్యూమినియం, స్టీల్ లేదా ప్లాస్టిక్ పాత్రలు, ఉపకరణాలు కొనుగోలు చేయరాదని, ఇది ఇంట్లో పేదరికాన్ని తీసుకువస్తుందని శాస్త్రం చెబుతోంది.
4. మత విశ్వాసాల ప్రకారం భగవంతుడు పరశురాముడు అక్షయ తృతీయ రోజున జన్మించాడు. పరశురాముడు విష్ణువు ఆరవ అవతారంగా పరిగణించబడ్డాడు.
5. అక్షయ తృతీయ రోజున చీపురు కొని ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా భావిస్తారు. దీంతో ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉంటుందని నమ్ముతారు. అంతే కాదు ఇంట్లో చీపురు లేదా చెప్పులు విరిగితే, అక్షయ తృతీయలోపు వాటిని ఇంటి నుంచి బయటకు విసిరేయాలని, ఎందుకంటే ఇవన్నీ పేదరికానికి సంకేతమని కొందరు నమ్ముతూ ఉంటారు.
అక్షయ తృతీయ 2023 ఎప్పుడు?
ఈ సంవత్సరం అక్షయ తృతీయను 22 ఏప్రిల్ 2023న జరుపుకోవాలి. ఈ రోజున, లక్ష్మీ దేవి, విష్ణువు ఆరాధించాలి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని విధిగా పూజించడం ద్వారా భక్తులు సుఖసంతోషాలు, సంపదలతో ధన్యులవుతారని పురాణం చెబుతోంది. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షం తృతీయ తిథి నాడు ఆచరిస్తారు.
